పోలవరం ప్రాజెక్ట్ పై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు

తిరుపతి :  చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై తప్పుదోవ పట్టిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.  2018 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని బాబు చెప్పడం దగాకోరుతనమే అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణంలో జవాబుతనం లేకుండా ఉందన్నారు.

కేవలం డబ్బు దండుకోవటానికే టీడీపీ యోచిస్తోందని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి వైయస్ జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజధాని నిర్మాణం తప్పనిసరిగా పూర్తి చేస్తోందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 

Back to Top