సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం బాబు పిచ్చితనం

గుంటూరుః పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ అరెస్ట్ దుర్మార్గమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాకు సంకెళ్లు వేయాలనుకోవడం చంద్రబాబు పిచ్చితమన్నారు. మీడియాను లోబర్చుకున్న బాబు సోషల్ మీడియాను కూడ కంట్రోల్ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాకు బాబు, లోకేష్ భయపడుతున్నారనడానికి రవికిరణ్ అరెస్టే నిదర్శనమన్నారు. మీ అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలను వెలుగులోకి తెస్తే అరెస్ట్ చేస్తారా..? అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రవికిరణ్ కు అండగా ఉంటామని అంబటి స్పష్టం చేశారు. 
Back to Top