విశ్వసనీయత కోల్పోయిన బాబు: భూమన

తిరుపతి 17 సెప్టెంబర్ 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారని తిరుపతి ఎమ్మెల్యే,  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలో మంగళవారం  విలేకర్లతో మాట్లాడుతూ ప్రజాభిమానం పొందేందుకే పదేపదే చంద్రబాబు తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారని  ఎద్దేవా చేశారు. చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా చంద్రబాబుకు ఆస్తులు ఉన్నాయన్నారు. ఆ ఆస్తులన్నీ చంద్రబాబు బినామి పేర్లతో ఉన్నాయన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే తన ఆస్తులపై సీబీఐ చేత దర్యాప్తు చేయించుకుని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top