బాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు

-వైయస్ జగన్‌ ను సీఎంగా చూసేందుకు పరితపిస్తున్నా
–టీడీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు
–బూచేపల్లి కుటుంబం వైయస్సార్‌ సీపీతోనే

దర్శిః వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని బూచేపల్లి కుటుంబం పరితపిస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్‌ డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాయలంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాము టీడీపీలోకి వెళ్తున్నట్లు మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లే అని చెప్పారు. తాము టీడీపీ నాయకులను కలవలేదని, టీడీపీ వారూ తమను పార్టీలోకి రమ్మని పిలవలేదని స్పష్టం చేశారు. మీడియాలో ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. టీడీపీతో  మంతనాలు చేస్తున్నామని చెప్తున్న అబద్ధపు ప్రచారాలను ఖండించారు. జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ల నాయకత్వంలో పని చేసి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని అన్నారు. రాజన్న రాజ్యం మరలా రావాలంటే మాట తప్పని , మడమతిప్పని నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. తాము వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని, రాజకీయాలనుండి తప్పుకోవడం లేదని అన్నారు. తాను పోటీలో ఉన్నా లేకున్నా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొనసాగుతామని స్పష్టం చేశారు. తాను పోటీ చేయనని ఎక్కడా మీడియాలో చెప్పలేదన్నారు. 
Back to Top