అడ్డగోలు దోపిడీకి తెరతీసిన చంద్రబాబు, లోకేష్‌


లక్షల కోట్ల పెట్టుబడులు, ఇండస్ట్రియల్‌ హబ్స్‌ ఏమయ్యాయి

వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మేరుగు నాగార్జున, గౌతమ్‌రెడ్డి

విజయవాడ: రాష్ట్రంలో అడ్డగోలు దోపిడీకి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్‌ తెర తీశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ టీయూసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదని  మండిపడ్డారు. రూ. వేల కోట్ల పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్‌ హబ్స్‌ ఎక్కడ అని ప్రశ్నించారు. లక్షలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీవితం ఆగమ్యగోచరంగా మారిందన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే కార్మికులు, శ్రామికులకు అండగా ఉంటామన్నారు. కేంద్రంపై బాబు యుద్ధం అంటున్నారు. ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రజలను మోసం చేయడమే బాబు నైజమని, ఇక ఆయన ఆటలు సాగవని మేరుగు మండిపడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ప్రజల తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
Back to Top