సత్య నాదెళ్ల గురించి చంద్రబాబు ఇన్ని అబద్దాలా..!

హైదరాబాద్‌: 1988 లో ఇంజనీరింగ్ చేసిన సత్య నాదెళ్ల.. తన ఐటీ స్ఫూర్తితో
చదువుకొన్నారని చంద్రబాబు చెప్పటం ఆశ్యర్యకరంగా ఉందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే,
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్
లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా, అది తన ఘనతే అని చెప్పుకోవటం చంద్రబాబుకే
సాధ్యం అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి ఐటీని తానే పరిచయం
చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇది ఎంత వరకు సబబు అని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్‌
సీఈవో సత్యనాదెళ్ల తాను ఇచ్చిన సలహా, స్ఫూర్తితోనే తాను ఐటీ చదివినట్లుగా
ముఖ్యమంత్రి చెప్పడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయ పడ్డారు.

        వాస్తవానికి మణిపాల్ నగరంలో సత్యనాదెళ్ల
1988లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. తర్వాతఅమెరికాలో ఎంఎస్, ఎంబీఏ చేసి 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. అక్కడ
క్రమక్రమంగా ఎదుగుతూ 2014లో సీఈవో అయ్యారు. అటువంటప్పుడు సత్య నాదెళ్ల
చదువుకోవటానికి చంద్రబాబు ఎలా స్ఫూర్తి దాయకం అయ్యారని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఐటీ జపం ప్రారంభించారని గుర్తు
చేశారు. అటువంటప్పుడు 1988 లో ఇంజనీరింగ్ చదువుకొన్న వ్యక్తికి చంద్రబాబు ఎలా
స్ఫూర్తిదాయకం అని సూటిగా ప్రశ్నించారు. అయ్యారు. అప్పుడు మీరిచ్చిన సలహా, స్ఫూర్తితో అని చెప్పుకోవడం ఏమాత్రం అర్థం
కావడం లేదు.                                                          

        ఇంజనీరింగ్ విద్య లో వచ్చిన మార్పుల
గురించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విశదీకరించారు. 1990 దాకా ఇంజనీరింగ్ లో
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి సాంప్రదాయ కోర్సులే ఉండేవని ఆయన
వివరించారు. తర్వాత కాలంలో స్పెషలైజేషన్ కోర్సులు వచ్చాయని, 2000వ సంవత్సరం తర్వాత
ఐటీ, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులు వచ్చాయని ఆయన విశదీకరించారు. అటువంటప్పుడు
బాబు చెప్పారని సత్య  నాదెళ్ల ఐటీ ఇంజనీరింగ్
చదవటం ఎలా సాధ్యం అని ఆయన ప్రశ్నించారు.  

        అదే సమయంలో సత్య నాదెళ్ల తండ్రి
ఐఎఎస్ అధికారిగా చంద్రబాబు దగ్గర పనిచేశారని కోతలు కోస్తున్నారని చెప్పారు. ఆయనే
స్వయంగా చంద్రబాబుకి ఫోన్ చేసి, తన కొడుకు కెరీర్ గురించి చర్చించినట్లు చంద్రబాబు
చెప్పుకొంటున్నారని ఎమ్మెల్యే రాజా అన్నారు. కానీ అసలు వాస్తవాలు భిన్నంగా
ఉన్నాయని ఆయన వివరించారు. సత్యనాదెళ్ల తండ్రి బి.ఎన్‌.యుగేంధర్‌ ఐఏఎస్‌గా దేశానికి
అత్యుత్తమ సేవలను అందించారు. ఆయన మీ దగ్గర పనిచేయడం ఏంటి..? అని సూటిగా ప్రశ్నించారు. ఎందుకంటే 1995లో బాబు ముఖ్యమంత్రి అయితే, అంతకు ఏడు
సంవత్సరాల ముందే ఏపీ క్యాడర్ నుంచి కేంద్ర క్యాడర్ కు యుగేంధర్ వెళ్లిపోయారని
పేర్కొన్నారు. 1960 కాలంలో కెరీర్ ప్రారంభించిన యుగేంధర్ 1986–88 దాకా మాత్రమే ఏపీలో సేవలు అందించారు. చివరగా ఏపీలో ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌
సెక్రటరీగా ఆయన సేవలను అందించారు. తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళల్పోయారు. 1993–95 వరకు రూరల్‌ ఏరియాస్‌ అండ్‌ ఎంప్లయిమెంట్స్‌
సెక్రటరీగా పనిచేశారు. 1988–93 వరకు లాల్‌బహదూర్‌శాస్తీ్ర నేషనల్‌ అకాడమీ
మసూరిలో పనిచేశారు. 1995–97లో ప్రధానమంత్రి పీఎంఓ కార్యాలయంలో
సెక్రటరీగా పనిచేశారు. రెండు సంవత్సరాలు మాత్రమే 1978–80లో ఏపీలో పనిచేశారని చెప్పారు. అటువంటప్పుడు
1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దగ్గర యుగేంధర్ పనిచేశారని చెప్పుకోవటం
ఆశ్చర్యకరంగా ఉందని బుగ్గన రాజా విశ్లేషించారు.

        ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా
అది తన ఘనతే అని చెప్పుకోవటం చంద్రబాబుకే చెల్లుతుందని బుగ్గన రాజేంద్రనాథ్
చమత్కరించారు. అదే పనికి రాని విషయం అయితే పక్కకు నెట్టేయటం కూడా ఆయనకు
చెల్లుతుందని అభిప్రాయ పడ్డారు. అందుకే హైదరాబాద్ ను తానే నిర్మించానని, కులీ
కుతుబ్ షా నవాబులు ఏమనుకొన్నా పట్టించుకోరని వ్యాఖ్యానించారు.

 

Back to Top