బాబుది అచ్చంగా భూ దోపిడీ..!


హైదరాబాద్: అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు రాజ‌ధాని క‌డుతున్నారా.. లేక భూ దోపిడీ చేస్తున్నారా.. అన్న‌ది తేల్చి చెప్పాల‌ని వైఎస్సార్సీపీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 
టీడీపీ వారు చేస్తున్న భూదందాను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, ఏ విధంగా అక్ర‌మంగా సంపాదిస్తున్నారో అందరు గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. తెలంగాణ‌లో ఎమ్మెల్యేలను ప‌శువులు కొన్న‌ట్లు కొంటున్నార‌ని, ప‌శువులు అమ్ముడుపోయిన‌ట్లు అమ్ముడుపోతున్నార‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న చంద్ర‌బాబు.. మ‌రి ఆంధ్ర‌లో మీరు చేసేదీ ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. డ‌బ్బుతో త‌ప్పుడు రాజ‌కీయాలు చేయ‌డం మీకు స‌ర్గీయ ఎన్టీఆర్ హ‌యం నుంచే వెన్న‌తో పెట్టిన విద్య అని చెప్పారు. విదేశాలు, రాష్ట్రాల నుంచి ఆంధ్రప్ర‌దేశ్‌లో భారీ పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని డ‌బ్బ కొట్టుకోవ‌డమే త‌ప్పా అవి ఇంత వ‌ర‌కు కార్య‌రూపం దాల్చిన పాపాన పోలేద‌ని ఆరోపించారు.
 ' మత్రులు, టీడీపీ నేతలు భూములు కొంటే తప్పేంట'న్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ..  భూములు కొల్లాగొట్టామని ఒప్పుకున్నట్లే ఉందని కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.  లింగమనేని భూములు వద్దని చెప్పానన్న ముఖ్యమంత్రి పేదల భూములు మాత్రం ఎలా లాగేసుకుంటారని ప్రశ్నించారు. 
రాజధాని ఎక్కడ పెడుతున్నారనే సమాచారం టీడీపీ నేతలకు లీక్ చేయడం వల్లే భూములు కొన్నారని, చంద్రబాబు అసలు రాజధాని కడుతున్నారా? భూ దోపిడీ చేస్తున్నారా? సమాధానం చెప్పాలని కోలగట్ల వీరభద్రస్వామి డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణమైన లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు ఉంటున్నంత మాత్రాన అది సక్రమనిర్మాణం అవుతుందా? అని వ్యాఖ్యానించారు. 
 రాష్ట్రంలో స్టీల్ ఇండ‌స్ట్రీ, జూట్ ఇండ‌స్ట్రీలు బాగలేవ‌ని గుంటూరు, విశాఖప‌ట్నం, కృష్ణ‌జిల్లా హ‌నుమాన్‌జంక్ష‌న్ వ‌ద్ద ఉన్న జ్యూట్ ప్యాక్ట‌రీ ప‌ని చేయ‌డం లేద‌ని అస‌లు ఈ సంగ‌తి చంద్ర‌బాబుకు తెలుసా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 12జ్యూట్ మిల్లులు మూత‌ప‌డ్డాయ‌న్నారు. రాష్ట్రంలో 35 ప‌రిశ్ర‌మ‌లు ఉంటే అందులో కేవ‌లం ఐదు మాత్ర‌మే ప‌ని చేస్తున్నాయ‌ని వివ‌రించారు. మీరు కొత్త ఇండస్ట్రీలు తేవొద్ద‌ని, ఉన్న ఇండ‌స్ట్రీల‌ను కాపాడితే రాష్ట్రంలో ల‌క్ష కుటుంబాలు బాగు ప‌డ‌తాయ‌ని చెప్పారు. 

తాజా ఫోటోలు

Back to Top