బాబు సిద్ధాంతం యూజ్‌ అండ్‌ త్రో..?

  • అఖిలప్రియకు హరికృష్ణకు పట్టినగతే పడుతుంది
  • భూమా నాగిరెడ్డి చావుకు చంద్రబాబే కారణం
  • ఎవరినైనా అక్కున చేర్చుకునే గుణం వైయస్‌ జగన్‌ది
  • వైయస్‌ఆర్‌ను ముస్లింలు ఎప్పటికీ మర్చిపోరు
  • బాబు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండటానికి వీళ్లేదు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబుది యూజ్‌ అండ్‌ త్రో సిద్ధాంతమని, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచాడంటే ఇంకా ఎవరినీ లెక్కబెట్టడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాలలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. భూమా శోభానాగిరెడ్డి బతికి ఉంటే భూమా నాగిరెడ్డి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ మారివుండేవారు కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలతో టీడీపీలో చేరిన భూమను క్షోభకు గురిచేశారన్నారు. భూమా చనిపోవడానికి కూడా బాబే కారణం అని విమర్శించారు. సీఎం కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి భూమా నాగిరెడ్డి ఎంత అని ఆరోపించారు. గతంలో హరికృష్ణను ఏ విధంగా చేరదీసి మోసం చేశాడో.. అదిగతి నేడు అఖిలప్రియకు కూడా పట్టే పరిస్థితి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు సిద్ధాంతం వాడుకోవడం వదిలేయడమేనని, నంద్యాల ప్రజలు ఇవన్నీ గమనించాలన్నారు. 

బాబును ఓటుతోనే ఖతం చేయాలి..
ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓటుతోనే ఖతం చేయాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని మేకపాటి అన్నారు. అలాంటి వ్యాఖ్యలు వైయస్‌ఆర్‌ సీపీ చేయాలని, ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు ఇచ్చి వంచిన వ్యక్తి చంద్రబాబును ఓటుతోనే ఖతం చేయాలని ఓటర్లకు సూచించారు. చంద్రబాబు చేసిన తప్పుల గురించే వైయస్‌ జగన్‌ మాట్లాడారన్నారు. ఏపీ జీవనాడి అయిన ప్రత్యేక హోదాను ఓటుకు కోట్ల కేసు కోసం తాకట్టుపెట్టాడని ఆరోపించారు. హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేయన్నారు. వైయస్‌ జగన్‌ అందరి తలలు పట్టుకుంటున్నాడని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దిగజారిపోయి మాట్లాడుతున్నాడని మేకపాటి మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ చేసినట్లుగా మరే నాయకుడు చేయలేడని, ప్రజల్లో ఉన్న ఆత్మీయత, ప్రేమ, ఎటువంటి వారినైనా అక్కున చేర్చుకునే గుణం వైయస్‌ జగన్‌దన్నారు. 

బాబుంటే ప్రజాస్వామ్య మనుగడ కష్టం..
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరని మేకపాటి అన్నారు. వైయస్‌ జగన్‌ కూడా తండ్రి బాటలో నడుస్తూ పేదవారి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి అన్నారు. ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల ద్వారా పేదలకు అన్ని విధాల జీవన ప్రమాణాలు కల్పిస్తారన్నారు. చంద్రబాబు ఉన్నంత వరకు ప్రజాస్వామ్య మనుగడ కష్టంగా ఉంటుందని, బాబు లాంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఉండటానికి వీల్లేదన్నారు. నంద్యాలలో బీజేపీ నేతలను కండువా వేసుకోకుండా ప్రచారం చేయాలంటూ, కాకినాడలో కండువా వేపించి తిప్పుతున్నాడన్నారు. నంద్యాలలో ముస్లిం ఓట్ల కోసం బీజేపీని కండువా వేసుకోవద్దు అని బాబు చెప్పారన్నారు. చంద్రబాబుది ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిత్వం కాదని, అంతా మోసం, టక్కర అని ధ్వజమెత్తారు. 
Back to Top