చంద్రబాబు ప్రత్యేకహోదాకు వ్యతిరేకమా..!

వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ  చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా కోసం పోరాడాల్సింది పోయి ...తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్న కార్యక్రమాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ దీక్షను సమర్థించాల్సింది పోయి ఆటంకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ ప్రైవేటు స్థలంలో వైఎస్ జగన్ శాంతియుతంగా చేయనున్న దీక్షను ట్రాఫిక్ సాకుతో అడ్డుకోవడమేంటని నిలదీశారు. 
ఎంతసేపు రాజకీయాలు, అధికారం తప్ప చంద్రబూకు ప్రజాసమస్యలు పట్టడం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రత్యేకహోదాకు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు.
Back to Top