బాబు కార్పొరేట్ కు దోచిపెడుతున్నారు

అనంతపురం:  పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మండిపడ్డారు. పాఠశాలల కుదింపు  నిర్ణయాన్నితక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ...వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోఅనంతపురం జిల్లా డీఈవో కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా సలాంబాబు మాట్లాడుతూ... కార్పొరేట్‌ విద్యాసంస్థల దెబ్బకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్ని మరుగునపడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అడ్డగోలుగా  దోచిపెట్టేందుకే చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా విద్యార్థి విభాగం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Back to Top