ఇకనైనా బాబు కళ్లు తెరవాలి

గుంటూరు(గురజాల):  ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్  దీక్షతోనైనా బాబు కళ్లు తెరవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి అన్నారు. తెలంగాణ నిర్మించనున్న అక్రమ ప్రాజెక్ట్ లను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ చంద్రబాబు...కేసీఆర్ తో  లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అటు కేంద్రంతోనూ, ఇటు తెలంగాణతోనూ అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.  

రాష్ట్రంలో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు  లబ్ధిచేకూరేలా బాబు పాలన ఉంది తప్ప...ప్రజలను ఆదుకునేందుకు ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. చంద్రబాబు నీరు-చెట్టు ద్వారా కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారని కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో గానీ, హోదా సాధించడంలో గానీ బాబు అన్ని  విధాలుగా విఫలమయ్యారని విమర్శించారు. 

Back to Top