బాబూ.. కళ్లబొల్లి మాటలు కట్టిపెట్టు

  • అదీచేస్తాం ఇదీ చేస్తామని రెండేళ్లుగా చెబుతూనే ఉన్నారు
  • ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు
  • రాయలసీమ జిల్లాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
  • కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకురాకపోతే ఉద్యమించక తప్పదు
  • బాబు మేల్కోవాలి..కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
  • వైయస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డి

వైయస్సార్ జిల్లాః విభజన చట్టంలోని హామీలను సాధించుకోవడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా బాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కళ్లబొల్లి మాటలతో కాలం వెళ్లదీస్తున్న బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డిలు హెచ్చరించారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఏమన్నారో వారి మాటల్లోనే...

  • రాయలసీమ జిల్లాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
  • కడపలో స్టీల్ ప్లాంట్ గురించి క్లారిటీ ఇవ్వకపోవడం దారుణం. 
  • పాఠశాలలు, పరిశ్రమలు, హాస్పిటల్ లు ఏది వచ్చినా బాబు అమరావతికి తరలిస్తున్నారు. 
  • మంత్రులు, ముఖ్యమంత్రి తలో మాట మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు
  • తడబాటు నిర్ణయాలు కాకుండా కడపలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా చూడాలి.
  • రాబోయో అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై కూడా పోరాడుతాం.
  • విభజన చట్టంలోని హామీలను సాధించుకోవడంలో టీడీపీ పూర్తిగా వైఫల్యం చెందింది.
  •  తెలుగుదేశం నాయకులు పార్లమెంట్ లో ప్రత్యేకహోదాపై కనీస నోరెత్తడం లేదు. 
  • పార్లమెంట్ లో ఇంత జరుగుతున్నా హోదా కోసం ప్రధానిపై ఒత్తిడి తీసుకురావడం గానీ, అడగడం గానీ చేయడం లేదు.
  • హోదా కోసం వైయస్సార్సీపీ అనేకమార్లు పోరాటం చేసింది.  అధ్యక్షులు వైయస్ జగన్ ఏకంగా ఢిల్లీలో దీక్షలు చేసి కేంద్రంపై తిరగబడి మాట్లాడారు.
  • కానీ అధికార పక్షం ఏమాత్రం నోరువిప్పడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించే పరిస్థితి ఉంది. ప్రజలు చాలా నిరాశ, నిస్పహల్లో ఉన్నారు. తాగడానికి నీళ్లు లేని ప్రాంతంలో కనీసం ఉక్కుపరిశ్రమ వస్తేనైనా ఉద్యోగాలు వస్తాయి. కుటుంబాలు బాగుపడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
  • బాబు  కళ్లబొల్లి మాటలు చెబుతున్నారు తప్ప ఏదీ కార్యరూపం దాల్చడం లేదు. 
  • బాబు మేల్కోవాలి. రెండేళ్లయిపోయింది.  సీట్లు రానంత మాత్రాన రాయలసీమ ఆంధ్రలో భాగం కాదని అనుకోవద్దు.
  • సీమపై దృష్టిపెట్టాలి. మాటలు కాకుండా  చేతల్లో చూపించాలి. 
  • వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు పేలవంగా వస్తున్నాయి. గట్టిగా అడగాలి. 
  • రైల్వే జోన్, హోదా సహా అన్నింటిపై వైయస్సార్సీపీ పోరాటం చేస్తుంది. 
  • ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా తెలుగుదేశం వ్యవహరిస్తోంది. 
  • అది చేస్తాం, ఇది చేస్తామని మాటలతో మభ్యపెడితే ప్రజలే బాబుకు తగిన బుద్ధి చెబుతారు.

తాజా వీడియోలు

Back to Top