బందర్ పోర్టులో బాబుకు వాటాలు

విజయవాడ: బందరు పోర్టులో చంద్రబాబు నాయుడుకు పరోక్ష వాటాలున్నాయని వైయస్సార్సీపీ నేత  గౌతంరెడ్డి బయటపెట్టారు. పోర్టు భూముల అంశంపై ఆయన  మీడియాతో మాట్లాడారు. వాటాలున్నందుకే లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని బాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు.  రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీలకు వేలాది ఎకరాలను దోచిపెట్టిన చంద్రబాబు... బందరు పోర్టు పేరుతో ఇప్పుడు చైనా కంపెనీలకు భూములు కట్టబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిపక్ష వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రైతులకు అండగా వైయస్సార్సీపీ పోరాడుతుందని గౌతంరెడ్డి తెలిపారు.

Back to Top