బాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారుః వైయస్ జగన్

వైయస్సార్ జిల్లాః చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చడం లేదని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధ్వజమత్తారు. ఇడుపుల పాయ గ్రామంలో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...బాబు ఈ రెండేళ్లలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. లక్షా 45 వేల కోట్ల అవినీతికి బాబు శ్రీకారం చుట్టాడని నిప్పులు చెరిగారు. బాబు మోసాలను రాష్ట్రవ్యాప్తంగా ఎండగడతామని, వైయస్సార్సీపీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ తాను కూడా పర్యటిస్తానని వైయస్ జగన్ తెలిపారు.

Back to Top