మోసాలు చేయటంలో చంద్రబాబుది పీ హెచ్ డీ

కడప)) ప్రజల్ని మోసం చేయటంలో చంద్రబాబు పీ హెచ్ డీ చేశారని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మండిపడ్డారు. ఇన్ని అబద్దాలు ఆడుతున్న బాబుని పిచ్చాసుపత్రిలో చేర్పించాలా లేక బంగాళాఖాతంలో వేయాలా అని ఆయన ప్రశ్నించారు. వైయస్సార్ జిల్లా కేంద్రంలోని కడప కలెక్టరేట్ దగ్గర జరిగిన ధర్నాలో వైయస్ జగన్ పాల్గొని ముఖ్య ప్రసంగం చేశారు. కరువు గురించి తెలీదని చంద్రబాబు చెప్పటాన్ని ఆయన తప్పు పట్టారు. రెయిన్ గన్లు అంటూ ప్రజల్ని మోసం చేయటం తగదని ఆయన హితవు పలికారు. చంద్రబాబు పాలన అంతా మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లు, దుర్మార్గాలతో నడుస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాయలసీమకు తాగు, సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు నాయకులు, పార్టీ నేతలతో కలిసి వైయస్సార్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.

Back to Top