బాబూ.. మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు

పామర్రు (మంగ‌ళ‌గిరి):

ఎన్నో మోస‌పూరిత వాగ్దానాలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం  చేసిన చంద్ర‌బాబు త‌గిన మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని  జిల్లా ప‌రిష‌త్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ తాతినేని ప‌ద్మావ‌తి హెచ్చ‌రించారు.  సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కైలే అనీల్‌కుమార్‌తో కలిసి ఆమె మాట్లాడుతూ టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లాలనే విషయాన్ని మర్చిపోయారన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులతోనే తమ పార్టీ అనుయాయులకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందిస్తూ సామాన్యప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీసీ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ , నవరత్నాలు , పార్టీ సభ్యుత్వాలు సేకరించాలనే ప్రజలలోకి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకునేలా టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కావాలనే నిర్వహిస్తోందని ఇది నీచ రాజకీయం కాదాని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర అన్ని రకాల రుణాలకు జన్మభూమి కమిటీ సంతకాలు కావాలనే నెపంతో పచ్చ చొక్కాల వారికే రుణాలను కట్టబెట్టారని విమర్శించారు. ఏ ఒక్క సామాన్య అభ్యర్థికి రుణం వచ్చిన పరిస్థితి లేక గ్రామాలలోని నిరుద్యోగులు సతమతమవుతున్నారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top