విలువల గురించి చంద్రబాబు మాట్లాడటమా?

ప్రత్యేక హోదా అంశాన్ని పక్క దోవ పట్టించే యత్నం
నేరస్తులను వెంటవేసుకుంటూ...ఎంపి విజయసాయిరెడ్డిపై విమర్శలా
చంద్రబాబుపై వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు ధ్వజం

విజయవాడ: చంద్రబాబు నాయుడు రాజకీయ విలువల గురించి మట్లాడటం సిగ్గుచేటని, ఎన్ టిఆర్ కుటుంబీకులెవరూ పార్టీలో లేకుండా చేసిన ఆయన చరిత్రను ఎవరూ మరిచిపోలేదని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి టిజెఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు  దగ్గర నుంచి విలువలు నేర్చుకోవాల్సిన గతి వైయస్ఆర్ సీపీ కు పట్టలేదన్నారు. బాబుకు విలువలుంటే, తమ పార్టీ నుంచి దొంగిలించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, తిరిగి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
 ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైయస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానపు సీరియస్ నెస్ ను తగ్గించే చర్యలకు పాల్పడుతున్నారన్నారు.  అవిశ్వాస తీర్మానపు విలువను స్థాయిని, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రానికి హోదా ఆవశ్యకతను చంద్రబాబునాయుడి గుడ్డి ప్రభుత్వం గమనించడం లేదంటూ ధ్వజమెత్తారు. హోదా ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతుంటే చంద్రబాబు మాత్రం, బిజెపితో ఎడబాటు, మోడీతో రాజకీయ వైరుధ్యం, అమిత్ షా రాజకీయ రాజకీయ వ్యవహారాల తెగతెంపుల్లో మునిగిపోవడమే కాకుండా, ప్రతినిత్యం ఎంపి విజయసాయిరెడ్డి పేరును తీసుకురావడం గర్హనీయమన్నారు.
రాష్ట్రంలోరాజకీయ వాతావరణం ఏమిటి ?హోదా ఉద్యమంలో టిడిపి పాత్ర, ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న కుట్ర పూరిత శైలి ఏమిటో ప్రజలందరికీ తెలిసిపోయి, ఆ పార్టీ  బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తే, తప్పించుకోడానికి ఇప్పుడు  బురద చల్లే కార్యక్రమానికి పూనుకున్నారని సుధాకర్ బాబు విమర్శించారు.

నాలుగేళ్ల పాటు బిజెపితో అధికారాన్ని పంచుకుని, ఎలా మంత్రిపదవులను పంచుకున్నారో, అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా ?  అని సూటిగా ప్రశ్నించారు. బాబు నైజం గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తోందన్నారు. 
ఆర్ధిక నేరాలంటూ పదేపదే ఆరోపిస్తున్న చంద్రబాబుకు , తన వెంటే ఉంటున్న సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేయడం, వాకాటి మోహన్ రెడ్డి అరెస్టు, పీలా గోవింద్ భూ ఆక్రమణలు, ఎంఎల్ సి దీపక్ రెడ్డి అరెస్టు, మంత్రి ఘంటా శ్రీనివాస్ పైన  సహచర మంత్రి చేసిన ఆరోపణలు నేరాలుగా కనిపించలేదా, విలువలంటే వాటిని కప్పిపుచ్చడమేనా అని నిలదీశారు. రైల్వే కాంట్రాక్టర్లకు బెరింపులు, కాల్ మనీ నిందితులు, రాజధాని భూముల అక్రమాల్లో భాగస్వామ్యులైన వారికి కొమ్ము కాస్తున్న చంద్రబాబు లాంటి వారికి విలువల గురించి మాట్లాడే నైతికత ఎక్కడిదన్నారు. భవిష్యత్తుల్లో  నేరస్తుడంటే చంద్రబాబులాగా  ఉంటారని చెప్పక తప్పని స్థితిని తెస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.

ఆంధ్రుల అభిమానాన్ని తెలంగాణా సిఎం దగ్గర తాకట్టు పెట్టి పారిపోయి వచ్చారు.  ఓటుకు నోటు కేసులో దొరికిన 50 లక్షలు ఎక్కడివో చెప్పాలి. బ్రహ్మ దేముడు దిగివచ్చినా చంద్రబాబును రక్షించలేరన్న కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవా మీ రాజకీయ విలువలు?లాలూచి రాజకీయాలు చేస్తున్నది ఎవరో ప్రజలకు అర్థం కావాడం లేదనకుంటున్నారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు కు  వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు జగన్ కు సంబంధించిన రాజకీయ విలువల గురించి మాట్లాడే అర్హత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. 
మీరున్న తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఎన్ టిఆర్ గారే స్వయంగా మీరు దొంగ అని చెప్పారు, దుర్మార్గులు, ఆయన పార్టీని దోచుకున్నారని చెప్పారు, మీరు అబద్దపు ముఖ్యమంత్రి, మీ నాయకత్వం శూన్యమంటూ తీవ్రంగా మండిపడ్డారు. 
 తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రాజకీయ శూన్యత కల్పించింది ఎవరు? ఎన్ టిఆర్ కుమార్తె  పురందేశ్వరి, తన  తండ్రి స్థాపించిన టిడిపిలో కాకుండా  ఇంకో పార్టీలో ఉండాల్సిన అసరం ఎందుకు వచ్చింది.
నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్ టిఆర్లు ఎక్కడున్నారంటూ అడిగారు తెలుగుదేశం పార్టీని  నారావారి పల్లెలో స్థాపించారా, నారా లోకేష్ టిడిపి  రాజకీయ వారసత్వ నాయకుడిగా ఎలా రూపాంతరం చెందాడు, నందమూరి వంశం నుంచి ఎందుకు రాలేదు ? టిడిపిలో నందమూరి వారి పాత్ర ఏమిటో వంటి ప్రశ్నలకు జవాబులు చెపితే, మీ విలువలు  తెలుసుకుని,  తాము నేర్చుకుంటామన్నారు. వంగవీటి మోహన్ రంగాను ఎవరు హత్య చేశారో విజయవాడ ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబునాయుడికి నిజంగా విలువలనేవి ఉంటే నారా వారి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.


వైయస్ జగన్ విలువలకు నిలువట్టద్దం

రాజీనామా చేస్తేగాని , తన పార్టీలోకి చేర్చుకోబోనంటూ ఎమ్మెల్సీ చేత రాజీనామా చేయించి రాజకీయాల్లో విలువలకు నిలువటద్దంగా  నేత వైయస్ జగన్ నిలిచారన్నారు.  ప్రజల హృదయాల్లో నుంచి స్వతంత్య్రంగా తమ పార్టీ ఏర్పడిందని అన్నారు.  విలువలకు తిలోదకాలిచ్చి, విలువలను గంగలో కలిపిన చంద్రబాబు నుంచి విలువలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. 
Back to Top