బాబు ప్రతి ఒక్కరినీ మోసం చేశారు

బాబు ధనం కోసం పాకులాడుతున్నారు
వైయస్ జగన్ జనశ్రేయస్సుకోసం పోరాడుతున్నారు
బాబుకు దమ్ముంటే మోదీని ఎదురించాలిః ఎమ్మెల్యేలు

కర్నూలుః  జనం కోసం జలం కోసం వైయస్ జగన్ దీక్ష చేస్తుంటే...కులం కోసం, ధనం కోసం చంద్రబాబు ధనదీక్షలు చేస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి, డిండిలు పూర్తయితే ఏపీ ఎడారిగా మారుతుందని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  రాబోవు భావితరాలకు వాటిల్లనున్న ప్రమాదానికి అడ్డుకట్ట వేసి వారిని రక్షించాలి...తాగు,సాగునీరు అందించాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ జల దీక్ష చేస్తున్నారని చెవిరెడ్డి చెప్పారు. దీక్షల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరించినా లెక్కచేయకుండా...జనం కోసం జనం శ్రేయస్సు కోసం వైయస్ జగన్ దీక్షలు చేస్తున్నారని స్పష్టం చేశారు. నిద్రపోతున్న దున్నపోతు ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకు వైయస్ జగన్ అలుపెరగకుండా పోరాడుతున్నారని చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం అక్రమగా ప్రాజెక్టులు కడుతుంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడుపు మాడ్చుకొని ప్రజల కోసం పోరాడుతుంటే చంద్రబాబు విహారయాత్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపడ్డారు. స్వర్గీయ వైయస్‌ఆర్‌ 80 శాతానికి పైగా పూర్తిచేసిన  గాలేరు నగరి, హంద్రీనీవా తెలుగుగంగా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు అక్కడే నిద్రపోతానని చెబుతున్న చంద్రబాబు..దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి కట్టకుండా అక్కడ నిద్రపోవాలని సూచించారు.

బతికున్న వ్యక్తి పేర్లను పథకాలకు పెట్టుకుంటున్న దౌర్భాగ్యం ఇక్కడ తప్ప ఎక్కడా చూడలేదని చెవిరెడ్డి అన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న మజ్జిగ.. ఇలా అన్నింటికీ ఆయన పేర్లే పెట్టుకుంటున్నారని, ఇక శిలావిగ్రహాలు పెట్టుకోవడం ఒక్కటే మిగిలిందని విమర్శించారు. ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో కూడా జనం ఆయనను నమ్మడం లేదని.. జగన్ నాయకత్వాన్నే నమ్మారని, అందుకే తనను అక్కడి ఎమ్మెల్యేగా ఎన్నుకొన్నారని చెవిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ప్రతి ఒక్కరినీ మోసం చేస్తూనే ఉన్నారని, తొలుత పిల్లనిచ్చిన మామను, తర్వాత సొంత తమ్ముడిని, ఆపై తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును, 2009 ఎన్నికల్లో వాడుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ను అందరినీ మోసం చేశారని గుర్తు చేశారు. ఇలా అందరూ చంద్రబాబు చేతిలో మోసపోతే మీరెందుకు అక్కడికి పోతున్నారని ఫిరాయింపుదారులను ప్రశ్నించారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొంటున్నారు . మీ పార్టీలో నాయకులు లేరా..? ఉన్నవారంతా చవటలు, దద్దమ్మలు, మాడాలు ఉన్నారా..? అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. నీరో చక్రవర్తి కంటే అధ్వానంగా నారా చక్రవర్తి తయారయ్యాడని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. కనీసం రోమ్‌ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి అక్కడే ఉన్నాడు కానీ, రాష్ట్ర తగలబడిపోతుంటే నారా చక్రవర్తి విదేశీ పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మకై వైయస్‌ జగన్‌ను జైల్లో పెట్టించినా జైల్లో ఉండి 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించాడని చెప్పారు. బయటికి వచ్చిన తరువాత 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించాడని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 70 ఏళ్ల వయస్సు వస్తున్నా సిగ్గు, శరం లేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కర్నూలు జలదీక్షలో ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ము, ధైర్యముంటే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటిముందు ధర్నా చేయడానికి ముందుకు రావాలని, తాము కూడా వస్తామని బాబుకు సవాల్ చేశారు.  రాష్ట్రంలో వైఎస్ జగన్ జలదీక్ష ఎందుకు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. కానీ సీఎం చంద్రబాబు, మంత్రులకు మాత్రం తెలియడంలేదని ఎద్దేవా చేశారు. రోజుకు తెలంగాణ ప్రభుత్వం 20 - 30 వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నా కళ్లుండి చంద్రబాబు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ప్రధాని మోదీని ధైర్యంగా అడగలేక గాలి తిరుగుళ్లు తిరుగుతూ.. మోదీ దగ్గర చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం కోసం వైయస్ జగన్ పోరాట యోధుడిలా దీక్ష చేస్తున్నారని కితాబిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా అభివృద్ధి పేరుతో టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితేనే వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. అలా అయితే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కదా అని కొడాలి నాని అన్నారు. దమ్ముంటే సోనియాగాంధీని వైయస్ జగన్ ఎదిరించి పోరాడినట్లు, చంద్రబాబు మోదీని ఎదిరించి పోరాడాలని సూచించారు.

చంద్రబాబు వారం రోజుల విదేశీ యాత్రల పేరుతో పనామా పేపర్ల అంశాన్ని సెటిల్ చేసుకున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే ఆయన బినామీ ప్రసాద్ పేరు పనామా పేపర్లలో ఉందని నాని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా వచ్చిందంటే అది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమేనన్నారు. కృష్ణా జిల్లాలో కాలువల నిర్మాణం కోసం వైయస్ఆర్ ఎంతో కృషి చేశారని.. టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుపడే ప్రయత్నం చేసినా ఆయన దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు.


To read this article in English: http://bit.ly/1WCDlJB 

Back to Top