జైలు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయాడు

హైదరాబాద్ః ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పై వ్యక్తిగత దాడి చేయడం తప్ప...అభివృద్ధి గురించి చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.  చేస్తున్న మోసాలు, తప్పులను సరిదిద్దుకోవాలని వైయస్ జగన్ బాబుకు సూచనలు చేస్తే....అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ జననేతపై నిందలు వేస్తున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, సోనియాగాంధీ కుట్రపన్ని పెట్టిన అక్రమ కేసుల వల్లే వైయస్ జగన్ జైలుకు వెళ్లాడని చెప్పారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోతాడన్న భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయాడని భూమన ఎద్దేవా చేశారు. బాబు నీచ, నికృష్ట రాజకీయాలను వైయస్సార్సీపీ ఎండగడుతుందని స్పష్టం చేశారు.

Back to Top