దోచుకునేందుకు చంద్రబాబు ట్రైనింగ్‌

పశ్చిమ గోదావరి: దోచుకునేందుకు టీడీపీ నేతలకు చంద్రబాబు, లోకేష్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ భీమవరం ఇన్‌చార్జ్‌ గ్రంధి శ్రీనివాస్‌ విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు . ఏదైనా మోసం చేస్తే ఈ ప్రాంత ప్రజలు తాటా తీస్తారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రతి అడుగు ప్రజల కష్టాలు తీర్చడానికే అన్నారు. మన కన్నీళ్లు తుడిచేందుకు వైయస్‌ జగన్‌ ఇక్కడికి వచ్చారన్నారు. జగనన్నకు అద్భుతమైన, అమోఘమైన స్వాగతం పలికిన మీ అందరికి నమస్కరిస్తున్నాని చెప్పారు. చంద్రబాబుకు ఒక ముని శాపం ఉందన్నారు. ఆయన నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందట. 2014 ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నారా లోకేష్‌ కూడా నిజాలు మాట్లాడుతారన్నారు. టీడీపీకి ఓట్లు వేస్తే మనకు మనమే ఉరి వేసుకున్నట్లు అని తెలంగాణలో అన్నారని గుర్తు చేశారు. అలాగే టీడీపీకి కుల గజ్జి ఉందని, కులపిచ్చి, మత పిచ్చి ఉందని ఆయనే ఒప్పుకున్నారన్నారు. టీడీపీ శిక్షణా తరగతుల్లో ఎలా దోచుకోవాలి? ఎలా దాచుకోవాలని ట్రైనింగ్‌ ఇస్తారన్నారు. భీమవరం మున్సిపాలిటీలో రాజకీయ అనుభవం లేని వ్యక్తి వచ్చారన్నారు. ఆయనకు వైస్‌ చైర్మన్‌ తోడైయ్యారన్నారు. బిల్డింగ్‌లకు అనుమతి ఇచ్చేందుకు కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. లంచాన్ని కూడా అందంగా ఆర్ట్స్‌ పెయింట్‌గా చూపించేందుకు ఎల్‌ఈడీ బల్బులు కొని భీమవరంలో వెలుగులు నింపుతామని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. ఎంత వసూలు చేశారన్నది ప్రజలకు చెప్పలేదు అన్నారు. అమృత పథకంలో పైప్‌లైన్లు వేసేందుకు రోడ్లు పగులకొడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇల్లు లేని వారందరికి ఇల్లు ఇచ్చారన్నారు. పక్కా ఇల్లు కట్టించారన్నారు. మహానేత ప్రోత్సాహంతో భీమవరంలో 82 ఎకరాల పొలం కొన్నామన్నారు. అందులో కూడా టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. భీమవరంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 126 ఎకరాల భూమి కొనుగోలు చేశామన్నారు. నీటి సమస్యను పరిష్కరించాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని కోరగా ఆయన చెరువులు తవ్వించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిన్నవరం గ్రామానికి వెళ్లి రైతులను కూర్చోబెట్టి భీమవరానికి మంచినీళ్లు ఇచ్చేందుకు భూములు ఇవ్వాలని చెప్పారన్నారు. మీరు భూములను నేరుగా ఇస్తే డబ్బులు ఆలస్యమవుతుందని నమ్మించి రైతుల భూములను పొంది,,ఇంతవరకు చెరువులు తవ్వలేదన్నారు. మా భూములు ఇవ్వమని రైతులు కోరితే ఎన్నికలు అయిపోగానే రిజిష్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పి..ఇవాళ మాట మార్చారన్నారు. మార్కెట్‌ రేటు ప్రకారం ఇస్తానని చెప్పడం దుర్మార్గమన్నారు. వీరికి చంద్రబాబు, లోకేష్‌ ట్రైనింగ్‌ ఇచ్చారన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకోండని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. ఆ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత వైయస్‌ జగన్‌ తీసుకుంటారన్నారు. కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కాబట్టి..ఆయన మన కష్టాలు తీర్చుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Back to Top