మనవడి వేడుకలే ముఖ్యమా?

ఏపీ అసెంబ్లీ: రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులపై చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వెళ్లడం శోచనీయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం గైర్హాజరు కావడాన్ని వైయస్‌ జగన్‌ తప్పుపట్టారు. సభలో సభ్యులందరి కంటే తానే ఎక్కువ సమయం కూర్చున్నానని ప్రతిపక్ష నేత చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం తన మనవడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్తున్న పరిస్థితుల్లో..మంత్రి తన వీపు తనకు కనపడనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి తన మనసాక్షిని అడగాలని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని వైయస్‌ జగన్‌  సూచించారు.  అధికారపక్షం తీరు కుక్కతోక వంకరలా ఉందని విమర్శించారు.

Back to Top