నిరుద్యోగుల జీవితాల‌తో బాబు చెల‌గాటం

క‌ర్నూలు: ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు నిరుద్యోగుల‌కు ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని, రెండు వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామ‌ని న‌మ్మించి మోసం చేశార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి మండిప‌డ్డారు. నిరుద్యోగుల జీవితాల‌తో ప్ర‌భుత్వం చెల‌గాట‌మాడుతోంద‌ని విమ‌ర్శించారు.  పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్ధతుతో పోటీ చేస్తున్న ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డికు తొలిప్రాధాన్యత ఓటు వేయాలని శేషారెడ్డి  మంగ‌ళ‌వారం వెలుగోడు ప‌ట్ట‌ణంలో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవినిలాంటిదన్నారు.ప్రత్యేకహోదా కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఈరోజు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు.  ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి అలుపెరగని  పోరాటం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్ధతు పలకాలని కోరారు.  

Back to Top