వైయస్‌ జగన్‌ను చూస్తే చంద్రబాబు జ్వరం

నెల్లూరు: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్వరం వస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదన్నారు. నెల్లూరులోని వైయస్‌ఆర్‌ సీపీ బూత్‌ కమిటీ సభ్యుల కార్యకర్తల సమావేశంలో మేకపాటి పాల్గొని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బూత్‌ కమిటీ సభ్యులదే కీలకపాత్ర అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించేందుకు కష్టపడి పనిచేయాలన్నారు
Back to Top