కేసులు తిరగదోడి తాటతీస్తారనే చంద్రబాబు భయం


అందుకే విభజన అంశాలు, హోదాను కేంద్రానికి తాకట్టు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు

అనంతపురం: ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలపై ప్రశ్నిస్తే ఎక్కడ ఓటుకు కోట్ల కేసు తీసుకువచ్చి తాటతీస్తారనే భయంతో చంద్రబాబు నాలుగేళ్లు ఏం మాట్లాడలేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. నాలుగేళ్లుగా అన్నివర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఏవిధమైన వ్యతిరేకత ఉందో వంచనపై గర్జన దీక్షలు నిదర్శనమన్నారు. అనంతపురంలో వైయస్‌ఆర్‌ సీపీ తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో కొరుముట్ల మాట్లాడుతూ.. విభజన చట్టంలోని అంశాలపై మొదటి నుంచి పోరాడుతుంది. తెలుగుదేశం పార్టీ నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి ఏ రోజూ ప్రత్యేక హోదాపై మాట్లాడలేదు. ప్రజల ప్రయోజనాలకంటే విదేశీ పర్యటనలకే చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. తిన్నది అరగక తెలుగుదేశం పార్టీ నవనిర్మాణ దీక్ష చేస్తున్నారన్నారు. ప్రజలను ఏ విధంగా మరోసారి మోసం చేయాలనే దురుద్దేశంతో జిల్లాకు ఒక నవనిర్మాణ దీక్ష చేపడుతున్నారని దుయ్యబట్టారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మీద గౌరవం ఉంటే వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల మాదిరిగా రాజీనామాలు చేసి ఉంటే ప్రజలు విశ్వసించేవారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల త్యాగాలను రాష్ట్ర ప్రజలు మర్చిపోరన్నారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు రాజీనామాలు చేశారన్నారు. 

60 సంవత్సరాల వ్యక్తి 11 రోజుల దీక్ష చేశాడంటే నమ్మే పరిస్థితేనా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. హైటెక్‌ దీక్షలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరు పోరాటం, త్యాగం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికలకు వెళ్తామని ఇదే గడ్డపై నుంచి చెప్పారని గుర్తు చేశారు. మండుటెండలో పాదయాత్ర చేస్తున్నారంటే అది ప్రజల దీవెనే అన్నారు. వైయస్‌ జగన్‌ పట్టుదల దేశం మొత్తం చూస్తుందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించాలనే లక్ష్యంతోనే వైయస్‌ జగన్‌ పోరాడుతున్నారన్నారు. రాయలసీమలో జరిగిన మొట్టమొదటి గర్జన దీక్షకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలంతా ఆదరించాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top