క్రీడాభివృద్ధిలో బాబు విఫలం

  • చంద్రగిరిలో గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం 
  • అకాడమీలకు, మైదానాలకు రూ. 10 అయినా ఖర్చు చేశారా
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు: క్రీడలను ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. 2019లో అమరావతిలో ఒలంపిక్స్‌ నిర్వహిస్తామన్న బాబు ఇప్పటి వరకు రూ. 10 అయినా క్రీడా మైదానాలు, అకాడమీలకు ఖర్చు చేశారా అని నిలదీశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రికెట్‌ ట్రోర్నమెంట్‌ను రోజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బ్యాట్‌ పట్టుకొని సందడి చేశారు. క్రీడాకారులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఒకరిద్దరు క్రీడాకారులకు సన్మానాలు చేసి, నజరానాలు ఇచ్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధి జరిగినట్లా చందరబాబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లు క్రీడాకారులను మోసచేయవద్దని రోజా కోరారు. ఏ దేశానికి లేని సంపద మన భారతదేశానికి ఉందని, అది యువతేనని, దేశంలో 50 శాతం యువత ఉననారన్నారు. అలాంటి శక్తిని మనం ఉపయోగించుకోవాలన్నారు. 
Back to Top