రాష్ట్ర హక్కులను కాపాడడంలో బాబు విఫలం

  • వైయస్సార్ విగ్రహ తొలగింపు దారుణం
  • తీసిన చోటే తిరిగి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి
  • లేకపోతే తామే విగ్రహం పెట్టాల్సి వస్తుంది
  • ప్రభుత్వానికి వైయస్సార్సీపీ నేతల హెచ్చరిక

హైద‌రాబాద్‌: మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచే విధంగా ప‌రిపాల‌న చేస్తే... చంద్ర‌బాబు మాత్రం పేద‌వాడి ఆత్మ‌గౌర‌వాన్ని కేంద్రం, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు తాక‌ట్టు పెడుతున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.    వైయ‌స్సార్ విగ్ర‌హాన్ని తొల‌గించినంత తేలిక‌గా ప్ర‌జ‌ల హృద‌యాల్లోంచి ఆ మహనీయున్ని తొల‌గించ‌లేర‌న్నారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏమన్నారంటే...

* వైయస్సార్ విగ్రహ తొలగింపు దుర్మార్గపు చర్య. చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు అవలంభిస్తున్నారు
* చంద్రబాబువన్నీ విధ్వంసకర ఆలోచనలే.
* బాబు ప్రత్యేక హోదా సాధనలో విఫలమై.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించడానికే వైయస్సార్ విగ్రహాన్ని తొలగించారు
* ప్ర‌జ‌లు రాజ‌న్న విగ్ర‌హాన్ని చూసి ఆ మహానేత పాలనను తలచుకుంటున్నారన్న భయంతోనే బాబు విగ్రహాల తొలగింపుకు పాల్పడుతున్నాడు 
* వైయ‌స్సార్ విగ్ర‌హం తొల‌గించాల‌నుకుంటే ముందుగా విగ్ర‌హం ఏర్పాటు చేసిన వారిని గానీ .. లేకుంటే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని గానీ సంప్ర‌దించాలి.
* విజ‌య‌వాడ‌లో ప‌డ‌మ‌ట ఉన్న ఎన్టీయార్ విగ్రహం కొంత‌మేర ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉన్నా వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దాన్ని తొల‌గించ‌లేదు.
* క‌నీసం నోటీసు కూడా ఇవ్వ‌కుండా వైయ‌స్సార్ విగ్ర‌హం తొల‌గించ‌డం దారుణం
* బాబు ఇప్ప‌టికే వైయ‌స్సార్ ప‌థ‌కాల‌కు తూట్లు పొడిచి... పేద‌వాడికి వెన్నుపోటు పొడిచాడు
* ప్ర‌భుత్వం పథకాలు పేద‌వాడికి అందాలంటే టీడీపీ కార్య‌కర్త‌ల ముందు చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డాల్సిన దుస్థితి నెల‌కొంది
* వైయస్సార్  విగ్ర‌హాన్ని సంస్క‌ార హీనంగా తొల‌గించ‌డాన్ని ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. 
* రాష్ట్ర ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడ‌డంలో చంద్ర‌బాబు దారుణంగా విఫ‌లం చెందారు.
* కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్ర‌భుత్వానికి  ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని చెబుతున్నా..బాబుకు బుద్ధి రావడం లేదు
* అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారొద్దు. నిబంధనలు ప్రకారం వ్యవహరించాలి
* ఇప్ప‌టికైనా  వైయ‌స్సార్ విగ్ర‌హాన్ని తిరిగి నెలకొల్పాలి.
* లేనిప‌క్షంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అదే చోట  విగ్ర‌హాన్ని పెట్టాల్సి వ‌స్తుంది అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Back to Top