బాబు..దుబారా

విజయవాడ:  రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఓ వైపు బీద అరుపులు అరుస్తూ...మరోవైపు , చంద్రబాబు విచ్చలవిడిగా దుబారా ఖర్చులు చేస్తున్నారు. కేవలం 26 కిలోమీటర్ల దూరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బాబు తన అక్రమ నివాసం నుంచి ఈ ఉదయం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి హెలికాప్టర్లో వెళ్లారు.  అడ్డగోలుగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబుపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకూ బాబు దుబారా ఖర్చు రూ. వేయి కోట్లకు పైగా తేలింది.

Back to Top