హింసను ప్రేరేపించడంలో బాబు దిట్ట

వైయస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌: దేశంలో హింసను ప్రేరేపించటంలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన రాజకీయ నేత మరొకరు లేరని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార దాహంతో చంద్రబాబు కేంద్రంతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి పదవులు పొందారని మండిపడ్డారు.

శాంతియుత ఆందోళనలను రక్తపాతం చేయటం బాబుకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. విద్యార్థుల ఆందోళనకు వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలిపి.. శాంతియుత ఆందోళనకు వేదికైన విశాఖ బీచ్‌కు వెళ్తూంటే విమానాశ్రయంలో అడ్డుకోవటం అప్రజా స్వామికమని దుయ్యబట్టారు. ప్రజలకోసం పోరాటాలు చేసే హక్కు ప్రతిపక్ష నేతకుందన్నారు.

Back to Top