బాబుది దుర్బుద్ధి

  • మహానేత ప్రాజెక్టులు కడితే..బాబు గేట్లు ఎత్తారు
  • వైయస్‌ఆర్‌ హయాంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులు
  • మూడేళ్లలో ఐదు శాతం పూర్తి చేసేందుకు టీడీపీ సర్కార్‌ అగచాట్లు
  • శ్రీశైలంలో 844 అడుగులపైగా నీరున్నా..సీమకు చుక్కనీరు కరువు
  • పులిచింతల నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్‌ ఇవ్వకుండా అన్యాయం
  • బాబు తీరుతో సముద్రంలో కలుస్తున్న 55 టీఎంసీల నీరు
  • మున్నాళ్ల ముచ్చటగానే ముచ్చుమ్రరి ఎత్తిపోతల స్కీం నిర్వాహణ
  • శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
శ్రీశైలం: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులు కడితే  తనకే పేరు రావాలన్నది చంద్రబాబు దుర్బుద్ధి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. మహానేతకు క్రెడిట్‌ ఇచ్చేందుకు బాబు నిరాకరిస్తున్నారని, వైయస్‌ఆర్‌ ప్రాజెక్టులు కడితే..బాబు గేట్లు ఎత్తి తానే కట్టినట్లు బిల్డప్‌ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 844 అడుగులకు పైగా నీరున్నా..రాయలసీమకు చుక్క నీరు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రకు వచ్చిన వైయస్‌ జగన్‌ గురువారం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యం, నీటి నిల్వలపై ఇంజీనీర్లును ఆరా తీశారు. అనంతరం ఆయన∙మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

పోతిరెడ్డిపాడు అన్నది రాయలసీమకు ప్రధానమైనది. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటిని విడుదల చేయాలంటే శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 844 అడుగుల నీటిమట్టం ఉండాలి. ఎన్ని రోజులు ఈ నీటిమట్టం ఉందని ఇంజనీర్లను అడిగితే ఈ ఏడాది ఆగస్టు 16 నుంచి 844 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ఈ రోజు శ్రీశైలం డ్యాం లెవల్‌ 862 అడుగుల నీరు ఉంది. దాదాపు 130 రోజులుగా శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 844 అడుగుల పైగా నీరు నిల్వ ఉన్నా..రాయలసీమకు ఇంకా నీళ్లు అందని పరిస్థితి. సీమలోని గండికోట, గాలేరు–నగరి ప్రాజెక్టుల పరిస్థితి అంతే..దిగువనున్న అన్ని ప్రాజెక్టుల పరిస్థితి అంతే పరిస్థితి నెలకొంది. ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు జరిగి, అక్కడ నీరు నిల్వ చేసే పరిస్థితి లేదు. శ్రీశైలంలో నీరు ఉండి తీసుకుపోలేని దుస్థితి నెలకొందంటే..ఇది చంద్రబాబు పాలన. టీడీపీ సర్కార్‌ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. 2009లో సంభవించిన వరదల కారణంగా ఫ్లంజ్‌పూల్‌కు గండి పడింది. వంద అడుగులపైన గొయ్యి ఏర్పడితే..ఆ గొయ్యిని పూడ్చడానికి ఇంతవరకు వీరికి మనస్సు రాలేదు. ఫ్లంజ్‌పూల్‌ను రిపేరీ చేయకపోతే డ్యాంకు ప్రమాదం పొంచి ఉంది. బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఈ పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపుతున్నా..సర్కార్‌ పక్కనబెడుతోంది. చంద్రబాబు పాలన ఎంత గొప్పగా ఉంటుందనడానికి ఇదో నిదర్శనం. ఇంత కన్నా గొప్ప నిదర్శనం పులిచింతల ప్రాజెక్టును చూడవచ్చు. అన్ని రకాలుగా పూర్తయిన పులిచింతల ప్రాజెక్టులో కూడా నీళ్లు నింపుకోలేని పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి చంద్రబాబు డబ్బులు ఇవ్వడం లేదు. ఆ డబ్బు ఇస్తే పులిచింతలలో 44 టీఎంసీల నీరు నింపుకోవచ్చు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కట్టి అప్పజెప్పినా కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌కు డబ్బులిచ్చే మనస్తత్వం చంద్రబాబుకు లేదు. బాబు తీరుతో 55 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నాయి. 

బాబు మనస్తత్వం ఎలాంటిదంటే..మొన్న మా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమ్రరి లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ప్రారంభోత్సవానికి చంద్రబాబు హాజరయ్యారు. ప్రాజెక్టును ప్రారంభించడం మంచిదే. కానీ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యానికి లోను చేశాయి. లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు అనుమతిలిచ్చింది దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గారే. ముచ్చుమ్రరి లిప్ట్‌ నుంచి కేసీ కెనాల్‌కు నీరు ఇచ్చేందుకు మహానేత హాయంలోనే 90 శాతం పనులు పూర్తి చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మరో ఐదు శాతం పూర్తి చేసింది. చంద్రబాబు మరో 5 శాతం అరకొరగా పూర్తి చేశారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి గారికి క్రెడిట్‌ ఇవ్వాల్సిన ప్రాజెక్టులో తానే ఆ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడ్డాడో అన్నట్లు బిల్డప్‌ ఇస్తూ..ఆ ప్రాజెక్టు కోసం ఎంతో కలలు కన్నాను అన్నట్లు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు కట్టింది వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు. ఈయన గేట్లు ఎత్తారు. చంద్రబాబు లష్కర్‌ పని చేసి, గేట్లు ఎత్తి వైయస్‌ఆర్‌కు క్రెడిట్‌ రాకుండా ప్రజలను మభ్యపెడుతూ..నేనే కలలు కన్నా అంటున్నారు. మహానేత హయాంలో 90 శాతం పనులు జరిగితే..ఈయన వచ్చిన తరువాత 5 శాతం పనులు పూర్తి చేసి మూడేళ్ల తరువాత నేను కలలు కన్నా అని, ఈ ప్రాజెక్టును నేనే కట్టానని ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అన్న దుర్భుద్ధితో బాబు ఆ క్రెడిట్‌ కూడా తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. దిక్కుమాలిన ఆలోచనలు అన్ని ఇలాగే ఉంటాయి. కట్టేది వేరే వాళ్లు..క్రెడిట్‌ తీసుకునేది ఈయన. జనవరి 2న ముచ్చుమ్రరి లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రారంభించారు కదా..నాలుగు పంపుల్లో రెండు పని చేశాయి. ఇవాళ ఆ రెండు పంపులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. అంటే అప్పటికప్పుడు ఆన్‌ చేశారు. అంతలోనే బంద్‌ చేశారు.మున్నాళ్ల ముచ్చటగానే ముచ్చుమ్రరి ఎత్తిపోతల పథకం మారడం చంద్రబాబు పాలనకు నిదర్శనం.

శ్రీశైలం డ్యాంను పరిశీలించిన వైయస్‌ జగన్‌
రైతు భరోసా యాత్రకు కర్నూలు జిల్లాకు వచ్చిన వైయస్‌ జగన్‌కు లింగాలగట్టు వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి, ఎమ్మల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజయ్య, రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య, చెరుకులపాడు నారాయణరెడ్డి, కుందూరు శివారెడ్డి తదితరులు అపూర్వ స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం వైయస్ జగన్ శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలపై వైయస్ జగన్ ఇంజనీర్లును అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం, నీటి నిల్వల వివరాలపై ఆరా తీశారు. ప్రాజెక్టు గేట్లను పరిశీలించారు. 

వసంతరావు కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ
సున్నిపెంటలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వసంత రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏడాది క్రితం వసంతరావును టీడీపీ నేతలు దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం ఇవాళ వసంతరావు కుటుంబ సభ్యులను పరామర్శించి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని జననేత హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందు వసంతరావు ఇంట్లో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, వసంతరావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు జననేతతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
 
Back to Top