చంద్రబాబు అవినీతికి రారాజు

() చంద్రబాబు అవినీతికి రారాజు

() బాబు పాలన వద్దు బాబోయ్ అంటున్న ప్రజలు

() చంద్రబాబు చర్యల్ని తూర్పారబట్టిన వైఎస్ జగన్ 

న్యూఢిల్లీ) ప్రజాస్వామ్య
పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్,
ఇతర పార్టీ నాయకులతో కలిసి వివిధ పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. మాజీ మంత్రి,
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను కలిశారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కుతూ
చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఆయన ద్రష్టికి తీసుకొని వెళ్లారు.
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే
చూద్దాం.

          న్యూఢిల్లీలోని ముఖ్య పార్టీల నాయకుల్ని కలవబోతున్నాం.
అపాయింట్ మెంట్ లు తీసుకొని వరుసగా కలుస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎన్సీపీ అధినేత శరద్
పవార్ ను కలిశాం. ప్రతీ ముఖ్యమైన పార్టీ నేతల్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న
అన్యాయాల్ని, పరిస్థితుల్ని జాతీయ నేతలకు వివరించ బోతున్నాం.

          చంద్రబాబు ఏ రకంగా అనైతిక చర్యలు చేస్తూ ఉన్నారు అనేది వివరంగా
విశదీకరిస్తున్నాం. చంద్రబాబుకి ఈ రోజు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ప్రజల్లోకి
వెళితే తిరిగి ఓట్లు వేస్తారు అనే నమ్మకం లేనే లేదు. ఎందుకంటే రుణమాఫీ పేరుతో
రైతుల్ని పూర్తిగా మోసం చేసిన పరిస్థితి. రుణమాఫీ పేరుతో అక్క చెల్లెమ్మల్ని
పూర్తిగా మోసం చేస్తున్న పరిస్థితి. ఇంటింటికీ జాబులు ఇస్తామన్నారు, లేదంటే ప్రతీ
ఇంటికి రూ. 2వేల నిరుద్యోగ భ్రతి ఇస్తామని చెప్పారు. ఈ పేరుతో చదువుకొన్న
నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు. 
చంద్రబాబు పాలనతో ప్రజలంతా విసిగిపోయి.. మాకొద్దు బాబోయ్, చంద్రబాబు పాలన
... అని ప్రతీ ఒక్కరూ చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇవన్నీ తెలుసు కాబట్టే
చంద్రబాబుకి తిరిగి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయటం లేదు.

తమ పార్టీకి చెందిన
ఎమ్మెల్యేలు కానే కాదు, వేరే పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు రూ. 20, 30 కోట్లు
ఇస్తామని చెప్పి ఎర చూపించి లాక్కొనే పని చేస్తున్నారు. చంద్రబాబు చేయాలనుకొంటే
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి. లేదంటే వాళ్లను అనర్హులుగా చేయాలి.
అటువంటప్పుడు ప్రజల దగ్గరకు వెళితే తిరిగి ఓట్లేస్తారన్న నమ్మకం చంద్రబాబుకి లేనే
లేదు.

          ఇవాళ అవినీతి డబ్బుల్ని చంద్రబాబు విచ్చలవిడిగా పంపిణీ
చేస్తుంటే. ప్రజాస్వామ్యం లో అంతా స్పందించాలి. ప్రతీ పౌరుడు నిలదీయాలి. ఇంతటి
నల్లధనం చంద్రబాబుకి ఎలా వస్తోంది అని ప్రశ్నించాలి. దీని మీద నిలదీయాల్సిన పరిస్థితి
ఉంది. విచ్చలవిడిగా పట్టపగలు ఈ మాదిరిగా కొనుగోలు చేస్తూ ఉంటే.. ప్రతీ ఎమ్మెల్యే
కొనుగోలుకి రూ. 20 కోట్లు, రూ. 30 కోట్లు ఎక్కడ నుంచి వచ్చింది అని చెప్పి
నిలదీస్తూ అడగాలి.  

 దీని మీద ఒక పుస్తకం విడుదల చేయటం జరుగుతూ ఉంది.
ఈ పుస్తకం పేరు చంద్రబాబు..ఎంపరార్ ఆప్ కరప్షన్. చంద్రబాబు గడచిని రెండేళ్లలో
చేసిన అవినీతి గురించి జీవో కాపీలు, ఆధారాలతో సహా పొందుపరచటమైనది. రిజిస్ట్రేషన్
డాక్యుమెంట్లతో సహా వివరాలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని అందరికీ ఇవ్వటం జరుగుతోంది.
ప్రతీ నాయకుడు, మీడయా ప్రతినిదుల, కేంద్ర సంస్థలకు అందించటం జరుగుతుంది. మొత్తంగా
అవినీతి రూ. 1, 34, 295 కోట్ల మేర లెక్క తేలింది.   ఇంత
అడ్డగోలుగా కొనుగోళ్లు చేస్తూ ఉంటే.. పట్ట పగలు 20, 30 కోట్లు ఇస్తూ ఉంటే అంతా
ప్రశ్నించాలి. ఇంతటి బ్లాక్ మనీ ఎక్కడ నుంచి వచ్చింది. అని నిలదీయాలి.

          తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో
టేపులతో సహా అడ్డంగా దొరికిపోయినప్పటికీ చలనం లేదు. అసలు ఆ టేపులు ఏమయ్యాయి. ఆ
టేపుల ఆధారంగా కేసులు ఎందుకు పెట్టడం లేదు. దీని మీద మేం ఒక్కరమే కాదు. చదువుకొన్న
ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలి. మీడియా ప్రశ్నించాలి. గ్రామాల్లోని రైతులు అడగాలి,
డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ప్రశ్నించాలి. నిరుద్యోగులు గట్టిగా నిలదీయాలి.

          ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత
ప్రతిపక్షానిది. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి, మోసం చేసిన పరిస్థితి. ఈ
మోసాలు, అబద్దాల మీద మేం గట్టిగా నిలదీస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. అందుకే
ప్రజల గొంతు వినిపించకూడదు అని భావిస్తున్నారు. మోసపోయిన రైతుల గొంతు
వినిపించకూడదు, మోస పోయిన డ్వాక్రా అక్క చెల్లెమ్మల గొంతు వినిపించకూడదు,
ఉద్యోగాలు రాక మోసపోయిన నిరుద్యోగుల గొంతు వినిపించకూడదు. ఈ గొంతు
వినిపిస్తున్నందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఈ
పరిస్థితిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఈ పుస్తకాలు పంచుతున్నాం. దీన్ని
ప్రతీ ఒక్కరూ చదవండి. చంద్రబాబు అవినీతి చర్యలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ
పుస్తకంలో ఉన్నాయి.

          అని వైఎస్ జగన్ సవివరంగా తెలియ చేశారు. అనంతరం జాతీయ మీడియాతో
వేరుగా ఇంగ్లీషులో మాట్లాడారు.

Back to Top