బాబు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారుః వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్ః రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ  ప్రజల రక్తాన్ని పీల్చుకొని తాగుతున్నారని  వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చంద్రబాబుపై  మండిపడ్డారు. ఇప్పటికే అవినీతి, నేరాల్లో  ఆంద్రప్రదేశ్ ను నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన చంద్రబాబు...ఊరూరా అడ్డగోలుగా బెల్ట్ షాపులను విస్తరిస్తూ మద్యాంద్రప్రదేశ్ గా మార్చుతున్నారని ధ్వజమెత్తారు. బాబు ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాల్లో ఒక్కహామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదని నిప్పులు చెరిగారు.

Back to Top