డ్రామాలాడుతున్న బాబు – మాజీ మంత్రి పార్థసారథి

గుడివాడ: నాలుగేళ్ల పాలనలో సంక్షేమాన్ని పూర్తి విస్మరించి,
కులవివక్ష చూపిన చంద్రబాబుకు, టిడిపికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా
ఉన్నారని మాజీ మంత్రి కె.పార్థసారథి పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా
సోమవారం గుడివాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.  చంద్రబాబు ప్రభుత్వం  ప్రజల సమస్యలను గాలికి వదిలేసి డ్రామాలు ఆడటం
మొదలెట్టిందన్నారు. పేదలకు సహాయం చేయాసలంటే అబ్బ సొమ్ము పోయినట్లుగా బాధపడుతూ,
దోచుకోవడంలో మాత్రం ముందుంటోందని ధ్వజమెత్తారు.  ఏ సంక్షేమ కార్యక్రమమైనా సరే, సక్రమంగా అమలైందా
చెప్పాలంటూ, దివంగత మహానేత వైయస్ ఆర్ హయాంలోని సామాజిక భద్రత కరువైందన్నారు. మోడీతో నాలుగేళ్ల పాటు కాపురం చేసి, ప్రత్యేక హోదా విభజన హామీలపై
ఇప్పుడు దొంగ  దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

నాలుగేళ్లుగా మహిళపై దాడులు
జరుగుతున్నా పట్టించుకున్న వారే లేరు. ఆఖరికి టిడిపి ముఖ్య నాయకులు ఆడపిల్ల కనిపిస్తే
..లేదంటే అంటూ సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడి
చేతకాని తనం కారణంగా బాలికలకు రక్షణ కరువైందని మండిపడ్డారు.

చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు
నిత్యం అవమానం జరుగుతోందని, బలహీన వర్గాల అందరూ చదువుకుని పైకి రావాలని వైయస్ ఆర్
ఆకాంక్షిస్తే , చంద్రబాబు నాయుడు మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయమంటే మత్సకారుల
తాట తీస్తానంటూ హెచ్చరిస్తారన్నారు.

చంద్రబాబు నాయుడి పరిపాలనలో , బిసిలకు
న్యాయమూర్తి పదవులు రాకుండా, న్యాయవాదులపై తప్పుడు నివేదికలు ఇచ్చి
అగౌరవపరిచారన్నారు. ఇంతటి అన్యాయం చేసినందుకు బలహీన వర్గాల ప్రజలందరూ టిడిపి
వారిని నిలదీయాలి పార్థసారథి అన్నారు. నక్క నాటకానికి ఎవరూ బలి కావద్దని, పేదల
వ్యతిరేకి, పెట్టుబడి దారులు అనుకూలుడైన సిఎం గారికి బుద్ది చెప్పుతూ టిడిపిని
బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. 

Back to Top