బీసీలకు చంద్రబాబు చేసింది శూన్యం

కర్నూలు: బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి అన్నారు. నంద్యాల పట్టణంలోని వై.యస్.ఆర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బీసీ అధ్యయన కమిటీ  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఫీజులు, స్కాలర్‌షిపుల విషయంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీల జీవన ప్రమాణాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని, వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పూర్తవ్వగానే బీసీ గర్జన నిర్వహిస్తామన్నారు.

ఈ సమావేశంలో  అధ్యయన కమిటీ సభ్యులు నర్స్ గౌడ్ , అవ్వారు ముసలయ్య,  వల్లెపు వరప్రసాద్ నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు  శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు బి.వై రామయ్య లతో పాటు  నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె,నందికొట్కూరు,పాణ్యం,శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు వివిధ కులసంఘాలు పాల్గొన్నాయి...


Back to Top