గుంటూరుః మహనీయుడు అంబేద్కర్ ను అడ్డుపెట్టుకొని చట్టాలను అపహాస్యం చేస్తూ, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ..చంద్రబాబు సభను తప్పుదోవ పట్టించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చర్చించే విషయాల్లో కప్పదాట్లు దాటుతూ తప్పుకున్నారని బాబుపై నిప్పులు చెరిగారు. <br/>చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గాలికొదిలి, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన వాటాను రాకుండా చేస్తూ, వచ్చిన వాటిని ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్నారని ఫైరయ్యారు. తమ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఏఫ్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ , 14న బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరపాలని నిర్ణయించినట్లు మేరుగ నాగార్జున చెప్పారు.