బాబుకు పాలించే అర్హత లేదు

పశ్చిమ గోదావరి: అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుకు ఆంధ్రరాష్ట్ర ప్రజలను పాలించే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ధ్వజమెత్తారు. లింగపాలెం మండలం రంగాపురంలో చింతలపూడి నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆళ్ల నాని హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అవినీతి పరిపాలనపై విరుచుకుపడ్డారు. మూడేళ్ల కాలంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాలో వైయస్‌ఆర్‌ సీపీ పటిష్టతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఘంటా మురళీ, రామకృష్ణ, నవీన్‌బాబు, కోటగిరి శ్రీధర్, తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top