చంద్ర‌బాబు రాజ‌కీయాలు సిగ్గుచేటు

కర్నూలు : ఇచ్చిన హ‌మీల‌ను నెర‌వేర్చ‌ని సీఎం చంద్ర‌బాబు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లంటూ నాట‌కీయ రాజ‌కీయాల‌కు పాల్ప‌డటం సిగ్గుచేట‌ని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్ నాయకులు బి.వై రామ‌య్య అన్నారు. మోసపూరిత విధానాల‌తో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు ఎందుకు చేస్తున్నారో ఎవ‌రి కోసం చేస్తున్నారో చెప్పాల‌న్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. స్వ‌యంగా సొంత పార్టీ ఎంపియే ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు ఎందుకంటూ ప్ర‌శ్నిస్తున్నారంటూ దుయ్య‌బ‌ట్టారు.  ప్ర‌జ‌ల సొమ్ముతో చేప‌ట్టిన ప‌థ‌కాల‌ను పార్టీ ప‌థ‌కాలుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. గ‌తంలో 9 సంవ‌త్స‌రాలు, నేడు నాలుగున్న‌ర సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తున్న సీఎం చంద్ర‌బాబు ఈ రాష్ట్రాన్ని ఏమి చేశారో గుర్తు తెచ్చుకోవాల‌న్నారు. గ‌తంలో ఇచ్చిన హ‌మీలపై ఒకసారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాలన్నారు. తిమ్మిని బొమ్మిని చేసి టీడీపీ ప్ర‌భుత్వం  ప‌బ్బం గ‌డుపుతోంద‌న్నారు. టీడీపీ ఒక మీటింగ్ నిర్వ‌హించాలంటే రాష్ట్రం  న‌లుమూల నుంచి జ‌నాల‌ను త‌ర‌లించుకోవాల‌సిన దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. అనేక హ‌బ్‌లు పేర్లు చెప్పి ప్ర‌జ‌ల ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని, హ‌బ్‌లు కాదు.. రాష్ట్రం లో క్ల‌బులు మాత్రం అడుగ‌డుగునా  ఉన్నాయ‌న్నారు. అలాగే ఎన్నిక‌ల‌ను ఒంట‌రిగా ఎదుర్కొలేని టీడీపీ పొత్తుల కోసం ఆరాట‌ప‌డుతుంద‌న్నారు. ప్ర‌త్యేక హోదా రాకుండా అడ్డుకునే మొద‌టి వ్య‌క్తి చంద్ర‌బాబేన‌న్నారు.  ప్ర‌తి ఉద్య‌మాన్ని అరెస్ట్‌ల‌తో నీరుగార్చ‌ార‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపిల‌తో బాటు టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్ర ప్ర‌భుత్వం దిగొచ్చేంద‌న్నారు. కేసుల‌కు భ‌య‌ప‌డి బీజేపీతో జ‌త క‌ట్టి చంద్ర‌బాబు డ్రామాలకు తెర‌దీశార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు మోస‌పూరిత విధానాలు, అబ‌ద్ధాలు ఇక ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని రానున్న ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు బుద్ధి చెబుతార‌న్నారు.
Back to Top