ముస్లింలంటే చంద్రబాబుకు అంతా అలుసా?

తనకల్లు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముస్లింలంటే అంత అలుసా అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంత‌పురం జిల్లా త‌న‌క‌ల్లు మండల మైనార్టీ కన్వీనర్‌ తబ్రేజ్, సీఆర్‌ పల్లి సర్పంచ్‌ చాంద్‌బాషాలు ప్రశ్నించారు. నూతన కేబినెట్‌లో ఒక్క మైనారిటీకి కూడ పదవి కట్టబెట్టకపోవడం చూస్తుంటే ఆయనకు ముస్లింలపై ఎంత మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. చంద్రబాబు నేటీకి ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముస్లిం మైనార్టీల‌ అభివృద్ధికి నిరంతరం కృషి చేసింది కేవలం దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ముస్లింలను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తగిన బుద్ధి చెబుతామని హెచ్చ‌రించారు.

Back to Top