కాపులకు చంద్రబాబు అన్యాయం

పశ్చిమ గోదావరి: కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు అన్యాయం చేశారని వంగా రవీందర్‌ విమర్శించారు. భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గోదావరి జిల్లాల్లో కాపుల సామాజికవర్గం అధికంగా ఉందన్నారు. అయితే ఈ ప్రభుత్వం కాపులను విస్మరించి అన్యాయం చేసిందన్నారు. కాపులకు వైయస్‌ జగన్‌ అండగా ఉంటారని, ప్రతి ఒక్కరూ జగనన్నకు తోడుగా నిలవాలని కోరారు. ముద్రగడ్డ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని ఈ ప్రభుత్వం వేధించిందన్నారు. అందరి సమస్యలను పరిష్కారం కావాలంటే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు. 
Back to Top