వ్యవస్థలను నాశనం చేసి బాగుచేస్తున్నట్లుగా బిల్డప్‌


రమణదీక్షితులపై చర్య శ్రీవారిపై తీసుకున్నట్లే
టీటీడీ బోర్డు మెంబర్‌లంతా కబ్జాకోరులు, గుండాలే
దుర్గమ్మ గుడిలో జరిగిన క్షుద్రపూజలపై చర్యలేమయ్యాయి
బ్రహ్మణ సామాజికవర్గం అంటే గౌరవం ఇదేనా
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లాది విష్ణు


విజయవాడ: రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసి అన్నీ ఆయనే బాగు చేస్తున్నట్లుగా చంద్రబాబు ఆయన తోక పత్రికల ద్వారా బిల్డప్‌ ఇచ్చుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లాది విష్ణు విమర్శించారు. టీటీడీ ట్రస్టు బోర్డు ద్వారా రమణదీక్షితులపై తీసుకున్న చర్య కలియుగ వైకుంఠం మీద తీసుకున్న చర్యగా వైయస్‌ఆర్‌ సీపీ  భావిస్తుందన్నారు. ప్రసిద్ధి కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో అంతా కబ్జాకోరులు, గుండాలు ఉన్నారని ఆరోపించారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందుత్వం కనుమరుగువుతుందేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు చేస్తే దానిపై అతీగతి లేదన్నారు. విచారణ కమిటీ వేస్తే ఇప్పటికీ చర్యలు తీసుకోని పరిస్థితి. 

నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన నేరాలు అనేకం ఉన్నాయన్నారు. ఇప్పటికైనా టీటీడీ బోర్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రమణ దీక్షితులపై చర్యను ఉపసంహరించుకోవాలన్నారు. టీడీపీ చేస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్‌ సీపీ నిరసన కార్యక్రమాన్ని రూపొందిస్తుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావును కించపరిచే విధంగా తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెడుతూ.. ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఐవైఆర్, రమణ దీక్షితులపై జరిగిన చర్యలకు బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే టీడీపీకి గౌరవం లేనట్లుగా అనిపిస్తుందన్నారు.  
Back to Top