ప్రభుత్వ సంస్థలను నాశనం చేసిన ఏకైక సీఎం చంద్రబాబు

తిరుపతి: అనేక సంస్థలను నాశనం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోతారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో అనేక వైఫల్యాలను మూటగట్టుకుందన్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామిని ధర్మాన ప్రసాదరావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం శాశ్వతంగా కొన్ని వ్యవస్థలను విచ్ఛినం చేయడానికి పూనుకుందన్నారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించని ఏకైన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇంటలీజెన్స్, సీబీఐ, ఏసీబీ, ఈడీ ఇతరత్ర సంస్థలను తనపై ఉసిగొల్పుతున్నారని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేసినప్పుడు విచారణ జరిపించేందుకు ముఖ్యమంత్రి మినహాయింపు కాదని, అవినీతికి పాల్పడితే ఎవరిపైనైనా విచారణ చేయవచ్చు.. చర్యలు తీసుకోవచ్చన్నారు. చంద్రబాబు తప్పుచేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.
Back to Top