రాజకీయ లబ్ధికే ఢిల్లీకి చంద్రబాబు


ఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. నాలుగు సంవత్సరాలుగా బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో, కేంద్రంలో సకల భోగాలు అనుభవించిన చంద్రబాబు మోడీ గ్రాఫ్‌ పడిపోయిందని భావించి థర్డ్‌ ఫ్రంట్‌ అంటూ ఢిల్లీ వస్తున్నారన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరుగుతున్న చంద్రబాబు పూటకో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చడమేనా నీ అనుభవం అని చంద్రబాబును ప్రశ్నించారు. మాట తప్పకుండా.. మడమ తిప్పని నాయకుడు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. లోక్‌సభలో ప్రత్యేక హోదా అంశం చర్చకు రాకపోతే పార్లమెంట్‌ నిరవధిక వాయిదా పడిన వెంటనే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటామన్నారు. ఒక పార్టీ ఎంపీలంతా రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు చేయడం దేశ చరిత్రలో మొదటి సారి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ఎన్డీయే ప్రభుత్వం కిందకు దిగి వచ్చి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని కోరారు. 
Back to Top