ఏం సాధించారని నిర్మాణ దీక్షలు



నారావారి నయవంచక దీక్షలవి

 దీక్షల పేరుతో కోట్లాది
రూపాయల ప్రజాధనం వృధా

వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జోగి రమేష్

విజయవాడ: నవ నిర్మాణ దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇవి నయవంచన దీక్షలని
వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. విజయవాడలోని పార్టీ
కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నారావారి నయవంచక దీక్షల పేరుతో
వీటిని నిర్వహిస్తే బాగుంటుందంటూ ఎద్దెవా చేశారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు
చేస్తున్న మోసాన్ని గ్రహించి, ఆయన తీరును అసహ్యించుకుంటున్నారని, అసలు ఏమి
సాధించారని చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేపడుతున్నారని జోగి రమేష్ ప్రశ్నించారు.
చంద్రబాబును ప్రజలంతా చీకొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. నాలుగేళ్ల కాలంలో ఏ
ఒక్క నిర్మాణాన్ని చేపట్టకుండా, నిర్మాణ దీక్షలు చేయడంలో అర్థం లేదన్నారు. తాను వేసిన రోడ్లపైనే నడుస్తున్నారంటున్న చంద్రబాబు నైజం చూస్తుంటే
, భూమి, గాలి, నీటిని కూడా తానే సృష్టించానని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను వంచినందుకా, రైతుల రుణమాఫీ, డ్వాక్రా
రుణమాఫీ చేస్తామంటూ వంచింనందుకా, ఇంటికో ఉద్యోగం, నెలకు 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని
మోసం చేసినందుకా, బిసిల రిజర్వేషన్లు 33 శాతానికి పెంచుతానని హామీ ఇచ్చి దగా చేసినందుకు,
సెక్స్ రాకెట్లను ప్రోత్సహించినందుకు నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారా అని
మండిపడ్డారు.

అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూముల్లో
ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని, ఆ భూముల్లో మొలిచిన గడ్డిని పశువులు తింటుంటే,
చంద్రబాబు నాయుడు ఆయన అనునాయులు ఇసుక, మట్టి, బూడిదలను సైతం మెక్కుతూ పొట్టలు పెంచుకుని
తిరుగున్నారని జోగి రమేష్ ఆరోపించారు.

నవనిర్మాణ దీక్షల కోసం పసిపిల్లను బలవంతంగా తీసుకురావలంటూ అధికారులకు
టార్గెట్ ఇచ్చారని, ఇలా తీసుకు వచ్చిన వారిచేత చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించడం, ప్రజల్లో
ఆగ్రహం పుట్టిస్తోందని, ఆయనంటే అసహ్యం పెరిగేలా ఉందని జోగి రమేష్ అన్నారు.
చిన్నపిల్లలు కూడా చంద్రబాబు నైజాన్ని చర్చించుకుంటూ, ఆయన తీరుపై
మండిపడుతున్నారన్నారు.

ప్రత్యేక హోదా సాధన కోసం
నాలుగేళ్లుగా పోరాటాలు చేస్తున్నది వైయస్ జగన్ నేతృత్వంలోని తమ పార్టీనేని, ఎన్నో
యుటర్నులు తీసుకుంటూ, ప్యాకేజికి అమ్ముడిపోయి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న
చంద్రబాబు వైఖరితో ప్రజలు విసిగిపోయారన్నారు. 

Back to Top