దళిత ద్రోహి చంద్రబాబు

విజయవాడ : దళితులను చంద్రబాబు మోసం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు.  విజయవాడలో  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు...దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దళితులకు పూర్తి న్యాయం జరిగిందన్నారు.

చంద్రబాబు అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న... సాక్షి టీవీ ప్రసారాలను కట్ చేయడం హేయనీయమన్నారు. తక్షణమే ప్రసారాలను  పునరుద్దరించాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు  మేరుగ నాగార్జున సూచించారు.


Back to Top