బాబు అంత అవినీతిపరుడు ప్రపంచంలో దొరకడు


తిరుపతి: చంద్రబాబు లాంటి అవినీతి సీఎం ప్రపంచంలోనే ఎవరూ ఉండరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిలు విమర్శించారు. ప్యాకేజీ ద్వారా రూ. 3 వేల కోట్లు కాజేశాడని ఆరోపించారు. తిరుపతిలో వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేతగాని తనం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్నారు. హోదా సంజీవని కాదు.. ఒరిగేదేమీలేదన్న చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమంతో వెన్నులో వణుకు పుట్టిందన్నారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్‌ చేశారు. 
వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల పోరాటానికి మద్దతు ఇవ్వండి...
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనిపక్షంలో 6వ తేదీన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని భూమన అన్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేసి నిరాహారదీక్ష చేపడుతారన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి వైయస్‌ఆర్‌ సీపీతో కలిసి రావాలన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల పోరాటానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు. మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు కలిసి రావాలని కోరారు. 
Back to Top