గడపగడపకూ బాబు అవినీతిని ఎండగడుతాం

  • రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను అమ్మేయ‌డ‌మే బాబు ధ్యేయం
  • రాష్ట్రాన్ని పక్కదేశాలకు, రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నాడు
  • ప్రజలు ఇచ్చిన బాధ్యతను వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు
  • దేవాలయాలను, ఆస్తులను తాబేదారులకు తాకట్టు పెడుతున్నాడు
  • దేశభక్తి, భద్రతతో బాబు చెలగాటమాడుతున్నాడు
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వేణుగోపాలకృష్ణ
హైదరాబాద్ః చైనా దేశానికి వెళ్లిన బాబు ఏపీ తీరంలో ఎక్క‌డ కావాలంటే అక్క‌డ పోర్ట్ ఇస్తాన‌ని చెప్ప‌డం దారుణ‌మ‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి వేణుగోపాలకృష్ణ అన్నారు. బాబు ఆలోచ‌న మొత్తం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క దేశాల‌కు తాక‌ట్టు పెట్టే విధంగా ఉన్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో దేశాల‌కు వెళ్లి 6 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని చెప్పిన బాబు.... రూ. 6వేల కోట్లు కూడా తీసుకురాలేద‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల్సిన ముఖ్య‌మంత్రే ఇలా రాష్ట్రాన్ని దార‌ధాత్తం చేయ‌డం దుర్మార్గమన్నారు. త‌న‌కు లాభం చేకూరుతుంద‌నుకుంటే ప‌క్క‌దేశాల‌కు ఏపీ తీర ప్రాంతాల‌ను కూడా అంద‌జేస్తాడ‌ని ధ్వజమెత్తారు.  అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు సంబంధించిన ఈవిషయంపై దేశ‌పౌరులంద‌రు స్పందించాల‌న్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. 
 
దేశభద్రత, దేశభక్తితో బాబు చెలగాటం
మొద‌టి నుంచి కూడా బాబు లక్షణాలు రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను ఇత‌ర దేశాల‌కు తాక‌ట్టు పెట్టే విధంగానే ఉన్నాయ‌ని వేణుగోపాలకృష్ణ విమర్శించారు. మొట్ట‌మొద‌టి కాకినాడ పోర్టును మ‌హాతి మ‌హ్మ‌మ‌ద్ కొడుకుకు అమ్మేశార‌ని, రాష్ట్రంలో పెట్టుబ‌డుల కోసం రాష్ట్ర భ‌ద్ర‌త‌ను అమ్మేస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. రాష్ట్ర స‌హ‌జ‌వ‌న‌రులైన అల్యూమినియం, సాండ్‌బీచ్‌, స‌హ‌జ సంప‌ద‌ల‌ను ప‌క్క‌దేశాల‌కు అమ్మేసిన చ‌రిత్ర బాబుద‌న్నారు. చైనా తీరంలోఅల్యూమిన‌యం ప్లాంట్‌ను, సాండ్‌ బీచ్‌ను దుబాయ్‌కి, సిరామిక్‌ను రాంకీకి అమ్మేసిన వ్య‌క్తి బాబేన‌న్నారు. రాష్ట్ర వ‌న‌రుల‌ను రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకోకుండా పక్కదేశాలకు, రాష్ట్రాలకు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కేజీబేస్‌లో ల‌క్ష‌లాది రూపాయ‌ల గ్యాస్ నిక్షేపాలు ప‌క్క‌రాష్ట్రానికి త‌ర‌లిపోతుంటే దానిని అడ్డుకోలేద‌న్నారు. చంద్ర‌బాబు దేశ‌భ‌క్తితో, దేశ భ‌ద్ర‌త‌తో చ‌ెల‌గాటం ఆడుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఢిల్లీకి వెళ్లిన బాబు హోదా గురించి ఎందుకు మాట్లాడ‌రు..?
ఎన్టీఆర్ రాష్ట్రంలో నిజ‌మైన ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ ఉండాల‌ని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీని స్థాపించార‌న్నారు. బాబు మాత్రం త‌న ప్ర‌యోజ‌నాల కోసం ఢిల్లీ వెళ్తారే త‌ప్ప ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడ‌ర‌ని ఆరోపించారు. ఓటుకు నోటు విష‌యంలో తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టుల విష‌యంలో బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని 5 కోట్ల మంది ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి అప్ప‌గించార‌ని విమ‌ర్శించారు. సింగ‌పూర్ దేశానికి రాజ‌ధాని రూపంలో తాక‌ట్టు పెట్టార‌న్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన బాధ్య‌త‌ను, హ‌క్కును వినియోగించ‌డంలో బాబు విఫ‌ల‌మ‌య్యార‌ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తిప‌క్ష పార్టీపైన మాత్రం పోరాటం చేస్తున్నార‌న్నారు. గ‌తంలో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేసిన ఘ‌న‌త బాబుకు ఉంద‌న్నారు. బాబు వైఖ‌రిని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంద‌న్నారు. రాష్ట్రంలో ఉన్న దేవాల‌యాలు, దేవాల‌యాల భూముల‌ను బాబు తాబేదారుల‌కు తాక‌ట్టు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్నారు. బాబు రెండేళ్ల కాలంలోని అవినీతిపై గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ ప్ర‌చారం చేస్తున్నామ‌న్నారు. 
Back to Top