తారా స్థాయికి బాబు అవినీతి

చిత్తూరు:  సీఎం త‌న‌యుడు లోకేష్ రాజ్యేంగేత‌ర శ‌క్తిగా ఎదుగుతూ   వేల
కోట్ల రూపాయిలు ఆర్జిస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన
కార్య‌ద‌ర్శి పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సునీల్‌కుమార్‌లు
ఆరోపించారు. చిత్తూరు జిల్లా స‌దుం మండ‌లంలోని మారుతివారిప‌ల్లెలో  విలేక‌రుల‌తో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి కుమారుడి
అవినీతిని రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. సీఎం చంద్ర‌బాబు అవినీతి
తారాస్థాయికి చేరింద‌ని విమ‌ర్శించారు. రైతు, మ‌హిళా సంఘాల రుణాల‌ను పూర్తిస్థాయిలో మాఫీ
చేస్తాన‌న్న చంద్ర‌బాబు మాట నిలుపుకోలేక పోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం
చేస్తున్నార‌ని వారు పేర్కొన్నారు. ప‌క్కా గృహాల‌ను నిరుపేద‌ల‌కు మంజూరు చేయకుండా
తెలుగు త‌మ్ముళ్ల‌కు మంజూరు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నించారు. జ‌న్మ‌భూమి
క‌మిటీ స‌భ్యులు తీవ్ర అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని ధ్వ‌జమెత్తారు. జేబీసీ క‌మిటీల
ప్ర‌మేయం లేకుండా అర్హులైన వారికి పింఛ‌న్లు, నిరుపేద‌ల‌కు ప‌క్కాగృహాలు వెంట‌నే మంజూరు
చేయాల‌ని డిమాండ్ చేశారు. రానున్న‌ది వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాజ్య‌మేన‌ని
వారు స్ప‌ష్టం చేశారు. 

 

Back to Top