సదావర్తి భూములు కొట్టేసేందుకు బాబు కుట్రలు

  • చంద్రబాబు బినామీపై ఘాటుగా స్పందించిన సుప్రీం కోర్టు
  • ప్రభుత్వంపై ప్రతిపక్షం నైతిక విజయం సాధించింది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
న్యూఢిల్లీ: హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసి సుప్రీం కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు సదావర్తి భూములను ఎలాగైనా చేజిక్కించుకోవాలని పథకం పన్నుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సదావర్తి భూముల వేలంపాటపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టిందని ఆర్కే తెలిపారు. విచారణ అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. భూమును వేలంపాట నిర్వహించారా.. వేలంలో భూములు ఎవరు ఎంతకు దక్కించుకున్నారన్న దానిపై సుప్రీం కోర్టు ప్రభుత్వ న్యాయ వాదులను అడిగి తెలుసుకుందన్నారు. ప్రభుత్వ న్యాయవాదులు వేలంలో పిటీషనర్‌ చంద్రబాబు బినామీ సంజీవరెడ్డి, రెస్పాండెంట్‌ ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారని చెప్పడం జరిగిందన్నారు. ఫస్ట్‌ బిడ్డర్‌ రూ.66.3 కోట్లకు పాడుకున్న సత్యనారాయణ బిల్డర్స్‌ డబ్బులు కట్టలేకపోయారు. ఆక్షన్‌ రూల్‌ ప్రకారం రెండవ బిడ్డర్‌కు సమయం ఇచ్చి డబ్బులు కట్టాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగిందని స్పష్టంగా చెప్పారన్నారు. పిటీషనర్‌ మందాల సంజీవరెడ్డి రూ. 22 కోట్లు పాడుకున్నాం.. ఆ బిడ్డును ఇంకా కొట్టేయలేదు కదా.. దాన్ని పరిగణలోకి తీసుకొని సదావర్తి భూములను మాకే కేటాయించాలని కోర్టును కోరడం జరిగిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తులు ఘాటుగా స్పందించిందన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఇష్టారీతిగా కేటాయించేది లేదని, ఎన్ని అవకతవకలు జరిగాయో మాకు తెలుసని కోర్టు తీవ్రంగా స్పందించిందన్నారు. కేసును వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసిందని చెప్పారు.

బిడ్డర్లను బెదిరిస్తున్న చంద్రబాబు, లోకేష్‌
సదావర్తి భూముల రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూ ప్రకారం ఎకరం రూ. 6 కోట్లపైచిలుకు ఉందని, కానీ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు బెదిరించడం మూలంగా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదని ఆర్కే అన్నారు. సదావర్తి భూములపై కేసులు ఉన్నా అన్నీ తెలిసే ఆక్షన్‌కు వచ్చామని సత్యనారాయణ బిల్డర్స్‌ చెన్నైలో మీడియా ముఖంగా చెప్పారని ఆర్కే గుర్తు చేశారు. కానీ డబ్బులు కట్టడానికి ముందుకు రాకపోవడంలో ఏదో ఆంతర్యముందని అనుమానం వ్యక్తం చేశారు. భూములు ఎలాగైనా దక్కించుకోవాలనే దురుద్దేశ్యంతో ఫస్ట్‌ బిడ్డర్‌ను  చంద్రబాబు బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. గతంలో తనను కూడా చంద్రబాబు తనయుడు లోకేష్‌ సదావర్తి భూములకు డబ్బులు కడితే ఐటీ రైడ్లు చేస్తామని బెదిరింపులకు గురిచేశారని గుర్తు చేశారు. కారుచౌకగా అప్పనంగా పేద బ్రాహ్మణులకు చెందాల్సిన ఆస్తిని రూ.22 కోట్లకు కొట్టేయాలని చేశారన్నారు. చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రహించి న్యాయపోరాటం చేసి రూ. 60 కోట్లకు భూముల విలువను పెంచిందన్నారు. చంద్రబాబు అవినీతిపై చేసిన పోరాటంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నైతిక విజయం సాధించి ప్రభుత్వానికి రూ. 40 కోట్ల ఆదాయం తీసుకొచ్చిందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top