రాష్ట్ర హక్కులను మోదీ పాదాల వద్ద తాకట్టు పెట్టారు

అనంతపురం: ఎన్నికల సమయంలో
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిడిపి, బిజెపి ప్రభుత్వాలు
విఫలమయ్యాయని అనంతపురం మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇక్కడి ఆర్ట్స్
కళాశాల మైదానంలో జరుగుతున్న వంచన పై గర్జన దీక్షలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక
హోదా తోపాటు , 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి పాటుపడతామని ఇచ్చిన హామీలను తుంగలోకి
తొక్కారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీ హక్కులను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు
పెట్టారు. ప్రత్యేక హోదా కోసం వైయస్ ఆర్ కాంగ్రెస్ఎంపీలు తమ పదవులను సైతం వదులుకున్నారన్నారు. ప్రభుత్వాల వైఖరి
వల్ల అనంతపురంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజి ఇచ్చి ఉంటే, రాయలసీమ
ఎంతో అభివృద్ధి సాధించి ఉండేదన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న పోరాటాలు
అధికారం కోసం చేస్తున్నవి కావని, ప్రజల ప్రయోజనాలే పరమావధికా చేస్తున్నవని స్పష్టం
చేశారు. పోరాటాలుచేసే వారిని తెలుగుదేశం పార్టీ నానా రకాలుగా ఇబ్బందుల పాలు
చేస్తోందని, ఇలాంటివి ఎన్ని ఎదురైనా రాష్ట్ర ప్రయోజనాలు సాధించేంత వరకు తమ పోరాటం మాత్రం
ఆగదని ప్రకటించారు.

Back to Top