చంద్రబాబు సిఎంగా ఉండటం మన కర్మ - ఎంపి మేకపాటి ధ్వజం

రాష్ట్రానికి
చంద్రబాబు నాయుడి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ప్రజల కర్మ అని ఎంపి మేకపాటి
రాజమోహన్ రెడ్డి అన్నారు. తెలుగుజాతికి చంద్రబాబు చేసిన ద్రోహం ఎప్పటికీ
మరచిపోలేనిదని ఆయన అన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వంచన
పై గర్జన సభలో ఆయన మాట్లాడారు. సొంతమామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఎన్నికల
సందర్బంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు.
చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లానంటూ చెప్పుకుంటున్నారనీ, వాస్తవంలో ఆయన
వెళ్లింది హోదా కోసం కాదని వైయస్ జగన్ పై అక్రమ కేసుల బనాయించడానికి, అసెంబ్లీ
సీట్ల పెంపు కోసమే అని మండిపడ్డారు. 

Back to Top