నిరుద్యోగ యువతను దగా చేస్తున్న చంద్రబాబు

శ్రీకాకుళం: రాష్ట్రంలో 1.8 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తాననడం యువతను మోసం చేయడమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సీఎం యువ సంహారం అనే పేరు పెట్టాలన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వేలాది మంది కాంట్రాక్ట్‌ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి 45 ఏళ్ల అర్హత ఉంటే.. చంద్రబాబు 36 ఏళ్లని చెప్పడం మోసం చేయడమేనన్నారు. ఎన్నికల సమయంలో 600ల వాగ్ధానాలకుపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, రైతులను, డ్వాక్రా సంఘాల మహిళలను ఇలా అన్ని వర్గాలను మోసం చేసి ఇప్పుడు నిరుద్యోగులను కూడా దగా చేస్తున్నారన్నారు. దీనికి చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top